టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఒక్క బ్రేక్ కూడా లేకుండా ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేస్తూ తన డెడికేషన్‌ని చూపిస్తున్నాడు ఈ రెబల్ స్టార్. తాజాగా ప్రభాస్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘కన్నప్ప’ సినిమాలో జాయిన్ అయ్యాడు.

సినిమా మంచు విష్ణుకి చాలా స్పెషల్ ప్రాజెక్ట్. అందుకే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నాడు. అంతేకాదు, వేరే ఇండస్ట్రీల నుంచి కూడా స్టార్ సెలెబ్రిటీలను దింపుతున్నాడు. కొద్ది రోజులుగా ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా సంబరపడిపోయారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ సినిమాలోని వేర్వేరు క్యారెక్టర్ల ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు.

అయితే, ప్రభాస్ రోల్ విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఎందుకంటే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేస్తున్నాడని కన్ఫర్మ్ చేశారు. దీంతో ప్రభాస్ ఏ రోల్ చేస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రభాస్‌కి సినిమాలో దాదాపు 40 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉంటుందట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనే చెప్పాలి. కొంతమంది ఏమో ప్రభాస్ శివుడికి నమ్మిన బంటు అయిన నంది పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. కానీ, దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ప్రభాస్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేస్తే కానీ క్లారిటీ రాదు. ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ప్రభాస్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.200 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు. అలాంటిది, ‘కన్నప్ప’ సినిమాలో మాత్రం రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాడట. మంచు విష్ణుతో ఉన్న ఫ్రెండ్‌షిప్, విష్ణు వాళ్ల నాన్నగారు మోహన్ బాబు మీద ఉన్న రెస్పెక్ట్‌తోనే ప్రభాస్ ఇలా చేస్తున్నాడని టాక్. నిజంగా ఇది నిజమైతే, ప్రభాస్ ఎంత మంచి మనసున్నవాడో, తన ఫ్రెండ్స్‌కి ఎంత హెల్ప్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ప్రభాస్ కీ రోల్‌లో కనిపించనుండటంతో ‘కన్నప్ప’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: