ప్రస్తుతం టెలికాం దిగ్గజ సంస్థలు తమ యూజర్స్ సైతం ఆకట్టుకునేందుకు 5జి నెట్వర్క్ ని అందిస్తూ భారీగానే రీఛార్జి ప్లాన్లతో వసూలు చేస్తూ ఉన్నారు. సామాన్యులకు ఇది భారంగా మారడంతో చాలామంది రీఛార్జ్ చేసుకోవాలంటే భయపడుతున్నారు..TARI వాళ్ల ఇటీవలే టెలికాం దిగ్గజ సంస్థలను సైతం హెచ్చరించడం జరిగింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్, జియో ఇతరత్రా నెట్వర్కులకు రీఛార్జి ప్లాన్ల పైన డేటా లేనివిధంగా కొన్ని ప్లాన్లను అమలు చేయాల్సిందే అంటూ తెలియజేశారు. దీంతో ఇటీవలే పలు రకాల టెలికాం దగ్గర సంస్థలు రీఛార్జ్ ప్లాంట్ ధరలను కూడా మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ప్రభుత్వ టెలికాం సంస్థ ఆయన బిఎస్ఎన్ఎల్ మాత్రం చౌక ధరకే రీఛార్జ్ ప్లాన్లను కూడా అందిస్తూ ఉన్నది. దీంతో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు కూడా కొన్ని లక్షల సంఖ్యలో పెరిగేశారు. దీనివల్ల ఇతర టెలికాం కంపెనీ యూజర్లు కూడా తగ్గిపోతూ ఉండడంతో ఒక్కసారిగా ఆ కంపెనీలు సైతం అప్రమత్తమయ్యి మళ్ళీ యూజర్లను ఆకట్టుకునే విధంగా ప్లాన్ ధరలను కొంతమేరకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ రోజున ఎయిర్టెల్ రెండు రీఛార్జ్ ప్లాన్లు ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది..


ఒకటి రూ.499 ప్లాన్ల పైన 30 రూపాయలు తగ్గించి.. 469 రూపాయలకు తీసుకువచ్చింది.. అయితే దీని వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుందట. అన్లిమిటెడ్ వాయిస్ కాల్ తో పాటు,900 ఎస్ఎంఎస్ లు కూడా వస్తాయట.


మరొక ప్లాన్ రూ .1959 ఈ ప్లాన్ పైన 110 రూపాయలు తగ్గించి రూ.1849 ధరకే తీసుకువచ్చింది ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాలనీ కూడా అందిస్తుంది. అలాగే మెసేజ్లను కూడా అందిస్తాయట. అయితే ఈ తగ్గించిన ధరలు కేవలం వాయిస్ కాల్స్ కోసం మాత్రమే రీచార్జ్ చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని ప్లాన్లను కూడా తగ్గిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: