మనం కంప్యూటర్, లాప్టాప్, పీసీలు ఓపెన్ చేసామంటే తప్పనిసరిగా గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తాం. మనం ఏది బ్రౌజ్ చేయాలనుకున్న దీనిలోకి తప్పనిసరిగా వెళ్లాల్సిందే. అలాంటి గూగుల్ క్రోమ్ ద్వారా అరిచేతిలో ప్రపంచాన్నే చూడవచ్చు.. ఇలా గూగుల్ క్రోమ్ ఉపయోగించి చాలామంది రోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అలాంటి గూగుల్ క్రోమ్ ను వాడుతున్నటువంటి యూజర్లకు కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.. ఇందులో రెండు లోపాలు ఉన్నాయని దానివల్ల మీరు హ్యాకర్ల చేతిలో పడి నష్టపోయే అవకాశం ఉందని తెలియజేస్తోంది..

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం  అధికారికంగా బయటపెట్టింది.. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ లో మార్క్ విండోస్  యూజర్లకు కేంద్ర సర్కార్  ఈ అప్డేట్ ఇస్తోంది..ఈ రెండు నష్టాలనుండి యూజర్లు తప్పించుకోవాలని ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని తెలియజేస్తోంది. స్మార్ట్ ఫోన్లు వాడే వారికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కానీ  కంప్యూటర్లు, పీసీలు వాడే వారికి  దీని ద్వారా నష్టం ఎక్కువగా కలుగుతుందట..వీటిని ఉపయోగించే సమయంలో హ్యాకర్లు  హ్యాక్ చేసి మనకు తెలియకుండానే మన విలువైన సమాచారాన్ని దొంగిలిస్తారట.. దీని నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు గూగుల్ క్రోమ్ ని అప్డేట్ చేయాలని తెలియజేస్తోంది..

ఇందులో ముఖ్యంగా  132.0.6834.83/8, 132.0.6834.110/111కు కంటే ముందు వెర్షన్ ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ వాడితే తప్పకుండా అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ తెలియజేస్తోంది. అంతేకాకుండా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం లినక్స్ యూజర్లు 132.0.6834.110 వెర్షన్ కు ముందు గూగుల్ క్రోమ్ వాడుతున్నట్లయితే లేటెస్ట్ వెర్షన్ కు వెళ్లాలని తెలియజేస్తున్నది. కాబట్టి ఈ రెండు అప్డేట్లను తప్పనిసరిగా  యూజర్స్ తెలుసుకోవాలని కేంద్రం ముందుగానే సమాచారం అందిస్తోంది. ఇందులో ఏమాత్రం  ఏమరపాటుతో ఉన్న మన విలువైన సమాచారం హ్యకర్ల చేతిలోకి వెళ్లి అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపై గూగుల్ యూజ్ చేసే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: