ప్రస్తుతం ఈ హెచ్చరిక ప్రతి ఒక్కరి ఫోన్లోనూ వినిపిస్తున్న సంగతి తెలుసు. మోసగాళ్లు ఎక్కువగా ఉండటంవల్ల ఈ హెచ్చరికలు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే జాగ్రత్త పడటం మంచిది. ఎవరైనా కాల్ చేసి ఓటీపీ అడిగితే మాత్రం అసలు చెప్పకండి. ఇలా చెప్పటం వల్ల మీరు మోసపోయా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రియల్ చెల్లింపుల సమయంలో మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నామని మూడింట ఒక వంతు మందికి పైగా ఓ సర్వేలో తెలిపారు. దేశంలో రియల్ టైం చెల్లింపుల వ్యవస్థలో మోసాల ముప్పు పెరుగుతోందని విషయాన్ని ఇది తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ అనలటిక్స్ సాఫ్ట్ వేర్ సంస్థ ఫికో 2024 లో ఈ సర్వే నిర్వహించింది. కొంతమంది ప్రజలకి హెచ్చరికలు చేస్తున్నారు. ఇందులో 1,000 మంది భారతీయులతో పాటు 14 దేశాలకు చెందిన సుమారు 11,000 మంది వినియోగదారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమకు సరఫరా కానటువంటి వస్తువులు, సేవలకు చెల్లింపులు చేసినట్లు 34 శాతం మంది తెలిపారు. రూ. 50,000 లోపు నష్టపోతున్న వాళ్లు 56 శాతం వరకు ఉంటారని నివేదిక తెలిపింది. రియల్ టైం చెల్లింపులు మున్ముందూ పెరగటం కొనసాగొచ్చు.

 అంతేకాకుండా వినియోగదారులు, వ్యాపారులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా విభిన్న వర్గాల మధ్య మరిన్ని లావాదేవీలు కూడా చోటు చేసుకోవచ్చు ని ఫికో మేనేజింగ్ డైరెక్టర్ దత్తుకోంపెల్ల తెలిపారు. 2023 తో పోలిస్తే 2024 లో మసాలాపై ఫిర్యాదు చేసిన భారత్ వినియోగదారులు సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ... అధిక మొత్తంలో నష్టపోయిన వారి సంఖ్య 2 శాతం నుండి రెట్టింపై 4 శాతానికి చేరింది. స్కామర్ల ద్వారా వచ్చే మెసేజ్ లతో మోసాల ముప్పు ఎక్కువగా ఉంటుందని 60 శాతం మంది వెల్లడించారు. ఈ పద్ధతిలోనే తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు డబ్బులు పోగొట్టుకుంటున్నారని 54 శాతం మంది తెలిపారు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: