ఇండియాలో ఎన్నో టెలికాం సంస్థలు ఉన్నాయి.. వాటన్నింటిలో  తక్కువ కాలంలో ఎక్కువ ఆదరణ పొందినటువంటి టెలికాం సంస్థ జియో.. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సిమ్ అయితే ఉంది. ఆ విధంగా ఎంతోమంది జియో కస్టమర్లను  అతి తక్కువ సమయంలోనే సంపాదించిన జియో సంస్థ కస్టమర్లకు అనేక ఆఫర్లు ఇస్తూనే, కోతలను కూడా విధిస్తోంది. అలాంటి జియో సంస్థ తాజాగా  తన రెండు డేటా ప్లాన్లు వ్యాలిడిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. రిలయన్స్ జియో మొదట్లో సిమ్ ను ఫ్రీగా అందించి కొన్ని నెలలపాటు  రీఛార్జ్ కూడా ఫ్రీగా చేసి అందరూ కస్టమర్లు ఈ సిమ్ ని వాడేలా చేశారు. ఆ తర్వాత ప్రతి కస్టమర్ ఈ సిమ్ వాళ్ళ పర్మినెంట్ సిమ్ గా మార్చుకున్న తర్వాత  రీఛార్జిల మోత మోగించడం మొదలుపెట్టారు.. 

ఫస్ట్ జియో రీఛార్జ్ కూడా ఇతర టెలికాం సంస్థల లాగాగే ఉంది.. జియో సంస్థ తాజాగా రెండు డేటా వ్యాలిడిటీలను తగ్గిస్తూ  వాటిని కేవలం వారం రోజులకు మాత్రమే పరిమితం చేసింది.. గతంలో ఈ ప్లాన్లు యూజర్ బేస్ ప్లాన్ తో వచ్చేది. వాళ్ల యొక్క ప్యాక్ గడువు ముగియడానికి 20 రోజుల ముందే ఈ డేటా ప్యాక్స్ రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు పనిచేసేది.. దీన్ని తొలగించి జియో ఏడు రోజులకే పరిమితం చేసింది.. ఇంతకుముందు రూపాయల 69 తో రీఛార్జి చేసుకుంటే 6 జీబీ డేటా  వచ్చేది. ఆ ప్లాన్ రీఛార్జ్ చివరి వరకు ఉండేది. కానీ ఇకపై ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం వారం రోజులు మాత్రమే పని చేస్తుందట.

130 రూపాయలతో ప్లాన్ చేస్తే 12జీబీ డేటా లభించి వారం మాత్రమే ఉంటుందట. ఈ విధంగా  డేటా ప్లాన్ తగ్గించడంతో జియో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇవే కాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి కొన్ని రీచార్జ్ ప్లాన్స్ కూడా జియో మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఏది ఏమైనా రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది కస్టమర్లను సాధించి టెలికాం రంగంలో  దూసుకుపోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: