
గూగుల్ సైట్ లో ప్రతిరోజు 4.97 బిలియన్ మంది గూగుల్లో ఉపయోగించుకుంటూ ఉన్నారట. గూగుల్ లో ఎక్కువగా వంట చిట్కాలు, బంగారం ధరలు, స్మార్ట్ టీవీలు బ్యాంకింగ్ వంటి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారట. ఇటీవల జరిగిన ఒక సర్వేలో వీటి గురించి బయట పెట్టారు.
గూగుల్లో ఎప్పుడు సెర్చింగ్ చేయకూడని విషయాలలో పిల్లల అశ్లీలతకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడూ కూడా సర్చింగ్ చేయకూడదట.
అలాగే దేశానికి విరుద్ధంగా ఎవరూ కూడా పోస్టులు చేయకూడదని అలాగే బాంబుల తయారీ పేలుడు పదార్థాలకు సంబంధించిన వాటిని అసలు సర్చింగ్ చేయకూడదట.
అలాగే తుపాకీలు ఎలా తయారు చేయాలి రాకెట్ లాంచ్ ని ఎలా తయారు చేయాలి.. నెట్వర్క్ లను ఎలా హ్యాకింగ్ చేయాలి అని విషయాలను సైతం ఎప్పుడూ సెర్చింగ్ చేయకూడదు ఇది చట్ట విరుద్ధమైన కార్యకలాపాల కింద అరెస్టు చేస్తారట.
అలాగే ఎవరికైనా సరే పోర్న్ వీడియోలను షేర్ చేసిన కూడా చిక్కుల్లో పడతారు.
ఇలాంటి వాటిలో ఎవరైనా సెర్చింగ్ చేస్తూ చిక్కినట్టు అయితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని సైబర్ క్రైమ్ అధికారుల సైతం వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటివి ఇన్ కాగ్నిట్ వెబ్సైట్లో సోదించినా సరే ఈ సమాచారం డైరెక్ట్ గా పోలీసులకు వెళుతుందట.