అయితే, మార్కెట్లో మనకి ఎన్నో రకాల హెల్మెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో నాణ్యమైనది కొనుక్కుంటే మంచిది. అయితే ఇపుడు కాలానికి తగ్గట్టు కొందరు స్మార్ట్ హెల్మెట్ కూడా అందుబాటులోకి తెస్తున్నారు. అయితే కంపెనీల స్మార్ట్ హెల్మెట్స్ గురించి తెలిసిందే. కానీ ఆంధ్రలోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ విజయ భార్గవి వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. రేకుల కుంట ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలిసి ఆమె స్మార్ట్ హెల్మెట్ తయారు చేయడం జరిగింది. దాని ప్రత్యేకత ఏమిటంటే? మద్యం తాగినా, హెల్మెట్ ధరించకున్నా బైక్ స్టార్ట్ కాకుండా దానిని రూపొందించారు. అంతేకాదండోయ్... వాహనదారుడికి ఎదైనా ప్రమాదం జరిగినా కుటుంబ సభ్యులకి అలర్ట్స్ వెళతాయి. దాంతో స్కూల్ యాజమాన్యం, స్థానికులు ఆమెని కొనియాడుతున్నారు.
ఇకపోతే నేటి యువత హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని భావించి హెల్మెట్ పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. చాలామంది కేవలం ట్రాఫిక్ పోలీసులకు భయపడే హెల్మెట్ ధరిస్తారు. అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది అన్నది వాస్తవం కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది కేవలం అపోహ మాత్రమేనట. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కేవలం ప్రాణాలకు రక్షణ మాత్రమే కాకుండా జుట్టుకు కూడా రక్షణ ఇస్తుంది అంటున్నారు మరి. అది దుమ్ము ధూళి జుట్టుకు తగలకుండా రక్షిస్తుందని అంటున్నారు.