సాఫ్ట్‌వేర్ రంగం తొలినాళ్లలో వెలుగులోకి వచ్చినప్పుడు, మన భారతీయులు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుకొని, దక్షిణాది రాష్ట్రాలు, ఆపై యావత్ భారతదేశం... గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అంతటా మన టాలెంట్ వెల్లివిరిసింది. నేడు విదేశాల్లో చూస్తే, టెక్నాలజీ రంగంలో భారతీయుల హవా స్పష్టంగా కనిపిస్తుంది.

ఎవరి గొప్పలు వాళ్లు చెప్పుకున్నా, సాఫ్ట్‌వేర్ రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది మాత్రం మనోళ్లే అని గర్వంగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ నిపుణుల్లో ఏకంగా 30 శాతం మంది భారతీయులే అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఇక్కడ కూడా మన భారత్ తన సత్తా చాటుతోంది. ఏకంగా 18 దేశాల్లో ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీసెస్, ఎడ్యుకేషన్ వంటి కీలక రంగాల్లో పనిచేస్తున్న 6000 మంది నిపుణులను సర్వే చేస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

21 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న ఈ నిపుణుల్లో 1700 మంది మన భారతీయులే. వీళ్లు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారు, అది కూడా 96 శాతంతో. ఇక ఇంగ్లాండ్ 84% తో రెండో స్థానంలో, అమెరికా 81% తో మూడో స్థానంలో నిలిచాయి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనోళ్ల వేగం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి, ఇండస్ట్రీలు కొత్త పుంతలు తొక్కుతాయని ఏకంగా 94% మంది భారతీయులు బలంగా నమ్ముతున్నారు. ఏఐకి తగ్గట్టుగా పని విధానాన్ని మార్చుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుందని 90% మంది భారతీయ నిపుణులు చెబుతున్నారు. అంటే మనోళ్లకి టెక్నాలజీ భవిష్యత్తుపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఏఐ నైపుణ్యాలు ఉంటే కెరీర్ పరంగా తిరుగులేదని, ఉద్యోగాల్లో, వృత్తుల్లో దూసుకుపోవచ్చని 94% మంది భారతీయ నిపుణులు ధీమాగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: