![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/technology/sports_videos/mobile-green-lite-mobile-hack43ccbb80-d0f7-4a5d-849f-22cc676eddc7-415x250.jpg)
అయితే ఒకవేళ మన మొబైల్ హ్యాక్ అయ్యిందా లేదా అనే ట్రిక్ ద్వారా కనిపెట్టవచ్చట. చాలామంది డబ్బులు కాజేయడానికి ఉపయోగించేటువంటి ట్రిక్ సీక్రెట్ పాస్వర్డ్, డేటాను దొంగలించడం.. అయితే వీరికి ఉన్న ఏకైక ఆయుధం ఏమిటంటే మనకు తెలియకుండా మన స్క్రీన్ రికార్డుని చేసుకోవడమే నట.. అలా మన వ్యక్తిగత డేటాను తీసుకొని మరి మన దగ్గర డబ్బులను డిమాండ్ చేస్తూ లేకపోతే పాస్వర్డ్ చోరీ వల్ల అకౌంట్ ని ఖాళీ చేస్తూ ఉంటారు.
మన మొబైల్ హ్యాకింగ్ కి గురైతే మన మొబైల్ స్క్రీన్ పైన గ్రీన్ కలర్ డాట్ కనిపిస్తూ ఉంటుందట.. ఇది మైక్ లేదా కెమెరా ఆన్ చేసినప్పుడు మాత్రమే బ్యాగ్రౌండ్ లో మన మొబైల్ యొక్క రికార్డు అవుతున్నట్లుగా సంకేతాలను ఇస్తుందట. ఒకవేళ మీ మొబైల్ లో కూడా ఇలాంటివి కనిపించినప్పుడు లైట్ గా తీసుకుంటే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది. ఇలాంటి హెచ్చరిక చేసినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి మీ సెక్యూరిటీ సెట్టింగ్ లోని ఏదైనా యాప్ ని యాక్సెస్ చేశారా లేకపోతే కెమెరా మైక్ ఏదైనా కొత్త యాప్ లో యాక్సెప్ట్ చేసిందా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. మొత్తం మీద మొబైల్ యూజర్లకి సైతం ఈ గ్రీన్ లైట్ దడ పుట్టించేలా కనిపిస్తోంది.