![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/technology/sports_videos/jio-ev-cycle-400-km8ec088c8-b909-4859-9b08-2fe6d3ed86ed-415x250.jpg)
ఈ జియో ఎలక్ట్రిక్ సైకిల్ సరసమైన ధరకే అందరికీ అందుబాటులో ఉంటుందట. ఈ సైకిల్ ఆధునిక డిజైన్ తో తయారు చేయడమే కాకుండా అందరిని ఆకర్షించే విధంగా ఉంటుందట. మహిళలకు కూడా అనుకూలంగానే ఈ సైకిల్ ని తయారు చేశారట. LED లైట్ల తో పాటు డిజిటల్ డిస్ప్లే కూడా ఈ జియో సైకిల్ కి అమర్చడం జరిగిందట. అధిక నాణ్యత గల పదార్థాలతో ఈ సైకిల్ ని చాలా సౌకర్యవంతంగా దృఢంగా ఉండేలా తయారు చేశారట. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ కలిపి ఉండడం వల్ల 400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట.
అలాగే ఈ సైకిల్ లో ఎకో మోడ్ నుంచి హై స్పీడ్ మోడ్ వరకు బహుళ ఎంపికలు కలిగి ఉంటాయట. GPS రాకింగ్ స్మార్ట్ కనెక్టివిటీ రివర్స్ 3 వంటి సదుపాయాలు కూడా ఉంటాయట. వాటర్ ప్రూఫ్ డిజైన్ తో పాటుగా ఏ రోడ్డుపైనైన సరే సుజావుగా నడిచేలా ఈ సైకిల్ ని తయారు చేశారట. ఈ జియో ఎలక్ట్రిక్ సైకిల్ ధర 25 వేల నుంచి 35వేల రూపాయల మధ్యలో ఉంటుందట. ఈ జియో సైకిల్ ఈ ఏడాది నుంచే ప్రారంభించబోతున్నారట. సామాన్యులకు కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ చాలా ఉత్తమమైనదిగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.