ఆ టెక్కీ సంపాదన సంవత్సరానికి రూ.7.5 కోట్ల రూపాయిలు. అంటే నెలకు సుమారుగా 63 లక్షలు. రోజుకి వేతనం చూసుకుంటే రెండు లక్షలు పైమాటే. అయినా ఆ కుర్రాడికి మానసిక ఆనందం కరువయ్యింది. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆ టెకీకి ఐదోతనం కరువయ్యింది అని భోగట్టా. అయితే ఈ విషయాన్నీ అతనే సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుత స్థాయికి ఎలా వచ్చింది అనేది రాసుకొచ్చాడు.

ఒక టెక్ ఎగ్జిక్యూటివ్ రూ.7.5 కోట్ల జీతం కోసం అనునిత్యం శ్రమించడం వలన, ఎట్టకేలకు ఓ కంపెనీ అతనికి రూ.7.5 కోట్ల జీతం ప్రకటిస్తూ నియామకం జారీ చేసింది. కానీ ఆ ఆనందం అతనికి ఎంతోకాలం నిలవలేదు. అధిక వత్తిడితో కూడిన ఉద్యోగాన్ని చేస్తూ అతగాడు తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసాడు. అతను తాను నిరంతరం శ్రమించి ప్రమోషన్ కొట్టే ప్రాసెస్ లో తన వైవాహిక జీవితం ఎలా కోల్పోయాడో వివరించాడు. సంవత్సరానికి $900,000 (సుమారు రూ. 7.5 కోట్లు) సంపాదించడానికి ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో నుండి L7 స్థాయికి చేరుకోవడానికి చాలా శ్రమించాడు. ఈ క్రమంలో అతని భార్య గర్భవతి అని మరిచాడు. ఆమెకి తోడు అవసరం అయినప్పటికీ దానిని పక్కనబెట్టి ఉద్యోగ ధర్మాన్ని పాటించాడు... గృహస్థ ధర్మాన్ని గాలికి వదిలేసాడు.

కట్ చేస్తే... అతని భార్య ప్రస్తుతం అతని నుండి విడాకులు కోరుతోంది. ఈ నేపథ్యంలోనే "నా L7 ప్రమోషన్ ఆమోదించబడింది, కానీ భార్య విడాకులు అడిగింది!" అడిగింది అంటూ వాపోతూ ఓ పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలో ఆ ప్రమోషన్ కోసం గత 3 సంవత్సరాలుగా తాను ఎలా కష్టపడ్డాడో రాసుకొచ్చాడు. కానీ అప్పటికీ చేయి దాటిపోయింది.. అంటూ వాపోయాడు. ఈ క్రమంలో అతగాడు చేసిన పెద్ద తప్పు ఏమంటే? అతని భార్య ఓ పండంటి కుమార్తెకు జన్మనిచ్చింది. కానీ ఆరోజు కూడా ఈ ఫుల్ బిజీగా తన ఉద్యోగ నిర్వహణలో ఉన్నాడు. దాంతో అతని భార్య ప్రసవానంతర నిరాశతో బాధపడుతూ... ఆఖరికి తన భర్తకి విడాకులు కావాలని పేపర్స్ పంపించింది. అయితే దీనిపైన సోషల్ మీడియాలో భిన్న రకాలుగా స్పందనలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: