మొదట్లో వినియోగదారులు ఎక్కువగా రావాలని అలాగే కస్టమర్లు కూడా పెరగాలని ఉద్దేశంతో చాలా టెలికాం దిగ్గజ సంస్థలు కూడా చౌక ధరలకే ప్లాన్లను అందించడమే కాకుండా పలు రకాల ఆఫర్స్ ప్రకటించేవారు. అలాగే గూగుల్ పే, ఫోన్ పే ఇతరత్రా పేమెంట్ సంస్థలు  కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా ఉండేవి. దీంతో టెక్నాలజీ ఎక్కువగా పెరగడంతో చాలామంది చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వీటిలోనే ఉపయోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొదట్లో 500 రూపాయలు ఉన్నటువంటి సెల్ఫోన్ రీఛార్జ్.. ప్రస్తుతం ఉన్న రోజులలో 3000 నుంచి 5000 రూపాయల వరకు వెళ్ళింది.


మొదట్లో 1000, 1500 రూపాయలు దొరికినటువంటి సెల్ఫోన్ ప్రస్తుతం ఉన్న రోజులలో పదివేల నుంచి లక్ష రూపాయలకు పైగా వెళ్ళింది.. ముందు అలవాటు చేస్తారు ఆ తర్వాత మన దగ్గర నుంచి రేట్లు పెంచేసి బాధేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విధంగా అన్ని సంస్థలు చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు కోకోలా 5 రూపాయలకే కూల్ డ్రింక్ ఇచ్చి ఆ తర్వాత ఇవాల్టి రోజున 30 నుంచి 50 రూపాయల వరకు ఎలా అయితే మన చేత తాగించి పెంచేస్తూ ఉన్నారు.. ఇప్పుడు అదే విధంగా గూగుల్ పే కూడా మనందరికీ ఉచితంగానే సేవలు అందిస్తా వచ్చింది..


ఇకపై గూగుల్ పే సేవలు ధనమవుతున్నాయట.. ఏదైతే గూగుల్ పే నుంచి మనం పే చేసేటువంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల నుంచి ఏదైనా బిల్లు పేమెంట్ చేస్తామో... చార్జీలు వర్తిస్తాయని తెలుపుతోంది. రాబోయేటువంటి రోజులలో ఎలక్ట్రిసిటీ వాటర్, కుకింగ్ గ్యాస్ బిల్స్ ఏవైతే చేస్తారో వాటికి గాను కొంతమేరకు చార్జీలు కూడా వసూలు చేస్తారట.. దీనికి పేరు కన్వీనియన్స్ చార్జ్ అని పేరు పెట్టారట. రాబోయే రోజుల్లో అన్ని ట్రాన్సాక్షన్స్ పైన కూడా నెమ్మదిగా ఇలాంటి వసూలు చేసే అవకాశం ఉన్నట్లు యూజర్స్ భావిస్తున్నారు. వీటితో చాలామంది ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలన్న కూడా కొంతమేరకు భయపడుతూ ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: