
వాకాటా జపాన్‌లోని సైతామాలోని ఓమియాలో పుట్టి పెరిగారు. అతను 3 డిగ్రీలను అందుకున్నాడు. 1987లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, 1989లో అప్లైడ్ మెకానిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, మరియు 2004లో క్యుషు విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ను పొందినట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. అంతేకాకుండా అతను జపాన్ ఎయిర్‌లైన్స్‌లో స్ట్రక్చరల్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం కూడా వుంది. ఈ క్రమంలోనే 1992లో వాకాటాను NASDA (నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆఫ్ జపాన్) వ్యోమగామి అభ్యర్థిగా ఎంపిక చేసింది. తరువాత అతడు nasa యొక్క జాన్సన్ స్పేస్ సెంటర్‌లో కూడా శిక్షణ పొందాడు.
విషయం ఏమిటంటే? 2024లో JAXA నుండి పదవీ విరమణ చేసిన ఈ ఇంటర్నేషనల్ జపనీస్ వ్యోమగామి బేస్ బాల్ ఆడారు. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! ఏకంగా అతను స్పేస్ షిప్ లో ఆడారు. ఈ క్రమంలో ఓ వైపు నుంచి బంతిని విసిరి, మరొక వైపు నుంచి బ్యాటుతో దానిని కొట్టడం జరిగింది. జపాన్‌లో MLB సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. దాంతో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 2000 డిసెంబర్లో, అతను nasa రోబోటిక్స్ ఇన్‌స్ట్రక్టర్ వ్యోమగామి అయ్యాడు. అతను ISSలో దీర్ఘకాలిక బస కోసం రష్యన్ సోయుజ్ అంతరిక్ష నౌక కోసం ఫ్లైట్ ఇంజనీర్ శిక్షణ స్టార్ట్ చేసాడు.