మీ చాటింగ్, కాలింగ్ అనుభవాలను మరింత సూపర్ గా మార్చేయడానికి వాట్సాప్ రెడీ అయిపోయింది. గ్రూప్ చాట్స్‌లో మరింత ఈజీగా కనెక్ట్ అవ్వడానికి, ఆర్గనైజ్డ్‌గా ఉండటానికి ఈ అప్‌డేట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటంటారా, అందులో టాప్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ మాత్రం గ్రూప్ చాట్స్‌లో "ఆన్‌లైన్" ఇండికేటర్.

డిస్‌కార్డ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాగైతే సర్వర్‌లో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో చూపిస్తుందో.. ఇప్పుడు వాట్సాప్‌లో కూడా గ్రూప్ చాట్‌లో ఎంతమంది ఆన్‌లైన్‌లో ఉన్నారో లైవ్ లో తెలిసిపోతుంది. ఐతే ఈ ఫీచర్‌ను టర్న్ ఆఫ్ చేసే ఆప్షన్ ఇస్తారా లేదా అనేది వాట్సాప్ ఇంకా చెప్పలేదు. కానీ ఎవరైతే చాట్‌ను యాక్టివ్‌గా చదువుతున్నారో వాళ్లని ఈజీగా గుర్తుపట్టొచ్చు.

ఇంకా గ్రూప్ నోటిఫికేషన్స్ మేనేజ్ చేయడం కూడా ఇప్పుడు మరింత సింపుల్ అయిపోయింది. "నోటిఫై ఫర్" అనే కొత్త ఆప్షన్ ద్వారా మీకు ఎలాంటి మెసేజ్‌లకు నోటిఫికేషన్స్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. రిప్లైలా? @మెన్షన్సా? లేక మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్ల మెసేజ్‌లా? అన్నీ కావాలంటే "ఆల్" అనే ఆప్షన్ ఉందిగా. అంతేకాదు, ఎవరైనా గ్రూప్‌లో మెసేజ్‌కు రియాక్ట్ అయితే, మీరు కూడా అదే రియాక్షన్‌ను సింపుల్‌గా ట్యాప్ చేసి యాడ్ చేయొచ్చు. డిస్‌కార్డ్, స్లాక్‌లలో ఉన్నట్టు సేమ్ టు సేమ్ అన్నమాట.

వాట్సాప్ ఈవెంట్స్ ఫీచర్‌ను కూడా మరింత అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఇన్విటేషన్‌కు "మే బి" అని రిప్లై ఇవ్వొచ్చు, గెస్ట్‌లను (ప్లస్ వన్) యాడ్ చేయొచ్చు, అంతేకాదు ఈవెంట్ ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా టైమ్ ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రైవేట్ చాట్స్‌లో కూడా ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, గ్రూప్ చాట్స్‌లో పిన్ చేస్తే అందరికీ ఈజీగా కనిపించేస్తుంది.

ఐఫోన్ యూజర్ల కోసం రెండు స్పెషల్ ఫీచర్లు వాళ్ళకోసం రెడీగా ఉన్నాయి. ఒకటి బిల్ట్-ఇన్ డాక్యుమెంట్ స్కానర్. ఇకపై వేరే యాప్ లేకుండానే డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసి, క్రాప్ చేసి, సేవ్ చేసుకోవచ్చు. రెండోది వాట్సాప్‌ను డిఫాల్ట్ యాప్‌గా సెట్ చేసుకునే ఆప్షన్. మీ ఐఫోన్ సెట్టింగ్స్‌లో "డిఫాల్ట్ యాప్స్"లోకి వెళ్లి ఈ సెట్టింగ్ మార్చుకోవచ్చు.

ఇంకా చాలా యూస్‌ఫుల్ అప్‌డేట్స్ ఉన్నాయి. వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌లను వినకుండానే టెక్స్ట్‌లా చదివేయొచ్చు. ఛానల్ అడ్మిన్‌లు షార్ట్ వీడియో వాయిస్ నోట్స్ (60 సెకన్ల వరకు) పంపొచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా ఛానెల్‌ను షేర్ చెయ్యొచ్చు.

చివరిగా వీడియో కాల్స్ క్వాలిటీ కూడా సూపర్ గా ఇంప్రూవ్ చేశారు. వీడియో కాల్స్ మరింత క్లియర్‌గా, నమ్మకంగా ఉంటాయి. కాల్ మధ్యలో ఎవరినైనా యాడ్ చేయాలంటే, కాల్ ఐకాన్‌ను ట్యాప్ చేస్తే చాలు. కాల్‌లో ఉన్నప్పుడు పిన్చ్ టు జూమ్ ఆప్షన్ తో లైవ్ వీడియోను మరింత క్లియర్‌గా చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: