అవును... గూగుల్, ఆండ్రాయిడ్ టీవీ కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్‌లో టెక్ దిగ్గజం 'గూగుల్' అనుసరిస్తున్న విధానాలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో ఆయా విధానాలు సరికావని CCI (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను గూగుల్ ప్లే స్టోర్‌లో డిఫాల్ట్‌గా అందించడాన్ని ఇకపై కొనసాగించబోమని కంపెనీ స్పష్టం చేసింది. సీసి ఆదేశాల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే... భారత్ ఇండియా స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. యాంటీ కాంపిటీటివ్ పద్ధతులు పాటిస్తోందని, మార్కెట్‌లో ఆధిపత్యం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోందని సీసీఐ ఆరోపించింది. ఈ క్రమంలోనే... ఇక్కడి మార్కెట్లో స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన 'టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్' కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్ & ఇతర అప్లికేషన్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' దర్యాప్తులో చేర్చింది. దీనిపై గూగుల్, ఆల్ఫాబెట్‌లపై ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు కేసు దాఖలు చేయగా.. CCI ఈ విషయంలో దర్యాప్తుకు ఆదేశించింది.

సీసీఐ ఆదేశాల మేరకు.. గూగుల్ కంపెనీ ఒక సెటిల్‌మెంట్ అప్లికేషన్ దాఖలు చేయడానికి అంగీకరించింది. దీని ప్రకారం.. దేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా.. విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇకపై గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిన నియమం అంటూ ఏదీ లేదు. కాబట్టి తమకు నచ్చిన ఏదైనా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుకునే స్వేచ్ఛ జనాలకు ఉంటుంది. అయితే, గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్‌ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు.. తాము ఎంచుకున్న మోడల్‌లో ఏవి ఇన్‌స్టాల్ అయి ఉన్నాయో రిటైలర్లు లేదా బ్రాండ్‌లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: