షాపింగ్ మాళ్లు, హోటల్ గదులు, హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో రహస్య కెమెరాలు అమర్చి.. అమ్మాయిలఛాయాచిత్రాలను రికార్డు చేస్తున్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. బాత్ రూంలో ఎలక్ట్రిక్ ప్లగ్ లు, ఫ్యాన్ రెగ్యులేటర్లు, టేబుల్ గడియారం, బల్బు, మొబైల్ చార్జర్ ఇలా గుర్తించలేని ప్రదేశాలలో రహస్య కెమెరాలుంటాయి. ఈ ట్రాప్‌లో ఇరుక్కున్నపలువురు మహిళలు ఆత్మహ్యతలకు పాల్పిడన సంఘటనలు మీడియా ద్వారా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే రహస్యకెమెరాలను గుర్తించగలిగితే, వాటి బారిన పడకుండా చూసుకోవచ్చు.
మరి వాటిని గుర్తించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సీసీకెమెరా లేదా మైక్రోఫోన్లను సీలింగ్స్ అదేవిధంగా లైట్లలో అమర్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వాటి పైనా ఓ కన్నేసి ఉంచండి. గదిలోకి వెళ్లేసరికి ఏదైనా చిన్నగా శబ్దం వస్తుందేమో గమనించాలి. కొన్ని రహస్య కెమెరాలు పనిచేస్తున్నప్పుడు చిన్నగా శబ్దం వస్తుంది. దాన్ని గుర్తిస్తే అక్కడ కెమెరా పనిచేస్తున్నట్లే అర్థం. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన డిటెక్టర్ మీ వెంట ఉన్నట్లయితే మీరు ఉండే కొత్త ప్రదేశంలో ఏఏ సాంకేతిక పరికరాలు ఉన్నాయో ఇట్టే కనిపెట్టవచ్చు.
మీరు వెళ్లిన ట్రెయిల్ రూమ్ లేదా రీఫ్రెష్ రూమ్‌లో అద్దాలు, పెయింటింగ్స్, పూల మొక్కలు ఇలా అన్ని వస్తువులను నిశితంగా పరిశీలించండి. సీసీకెమెరాలను ఎక్కువుగా ఇలాంటి ప్రదేశాల్లోనే అమరుస్తారు. రాత్రి సమయంలో గదిలో కెమెరా ఉందా అని గుర్తించాలంటే, ముందుగా లైట్లన్నీ తీసేయాలి. గదిలో ఎక్కడినుంచైనా ఎరుపు లేదా ఆకుపచ్చని వర్ణంలో చిన్న చుక్కగా లెడ్ లైట్ కనిపిస్తే మాత్రం అక్కడ నైట్‌విజన్ కెమెరా పనిచేస్తున్నట్లే. సో.. బీకేర్‌ఫుల్..!