పట్టుదల ధృడ  సంకల్పం..ఆ  ఆటగాసొంతం.. ఒకసారి మైదానంలోకి దిగాడంటే  స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు  అందరిని పెవిలియన్ పంపిస్తూ ఉంటాడు... అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో జట్టులో కీలక ఆటగాడిగా  ఎదిగాడు... కేవలం తన స్పిన్ మాయాజాలంతోనే  జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్ తో మెరుపులు మెరిపించారు... అద్భుతంగా రాణించి టీమిండియాకు విజయాల్లో  ఎంతో కీలకంగా మారిపోయాడు.ఆ  ఆటగాడు ఎవరో  కాదు టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. 

 

 టీమిండియాలో హర్భజన్ సింగ్ ప్రస్థానం అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలి. మొదటిసారిగా 1998లో టెస్ట్ వన్డే క్రికెట్లో స్థానం సంపాదించి భారత జట్టు లోకి అడుగుపెట్టాడు హర్భజన్  సింగ్ . ఇక మొదటి నుంచి ఎంత దూకుడుగా వ్యవహరించే హర్భజన్ కి   మొదట్లోనే క్రమశిక్షణ చర్యల పేరుతో ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత 2001 వరకు జట్టుకు దూరమయ్యాడు. అయినప్పటికీ పట్టుదలతో మళ్లీ అనుకున్నది సాధించి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. భారత జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడి గా నిరూపించాడు. 

 

 తన లెగ్ స్పిన్ మాయాజాలంతో  ఎంతో  మంది దిగ్గజ బ్యాట్స్మెన్ లని  సైతం పెవిలియన్ బాట పట్టించి జట్టుకు ఎన్నోసార్లు విజయాలను అందించాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ వికెట్లు  సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ హర్భజన్ సింగ్ మాత్రమే. గంగూలి ప్రోత్సాహంతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న హర్భజన్ సింగ్ ఆ తర్వాత ధోనీ సారథ్యంలో మరింత రాటు తేలాడు. అయితే స్పిన్ మాయాజాలంతో ఎప్పుడు జట్టులో కీలక బౌలర్ గా మారడమే కాదు అవసరమైనప్పుడు తన బ్యాట్ తో  కూడా ఎన్నో మెరుపులు మెరిపించారు హర్భజన్  సింగ్. కీలక సమయాల్లో జట్టులో ఫోర్లు, సిక్స్ లతో  మెరుపులు మెరిపించి టీమిండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని లికించుకున్నారు. ధృడ  సంకల్పంతో ముందుకు సాగుతూ ఎప్పుడూ ఖచ్చితత్వం అంకితభావం గల ఆటగాడిగా  టీమిండియాలో తన ప్రస్థానాన్ని కొనసాగించిన బజ్జీ నేడు హెరాల్డ్  విజేతగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: