ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి. ప్రపంచంలో భయంకరమైన క్రూర మృగాల్లో కొండచిలువలు ముందు వరుసలో ఉంటాయి. అవి ఎంత భయంకరంగా వుంటాయో చెప్పనవసరం లేదు. వాటిని చూస్తేనే భయంతో చస్తారు జనాలు. జనాలు ఎక్కువగా సంచరించే మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లోకి పెంపుడు కుక్కలను తీసుకెళ్లినా ప్రమాదమే. అలాంటిది ఆ వ్యక్తి ఏకంగా కొండ చిలువను వెంట తీసుకెళ్లాడు. అతడు చేసిన పనికి ఆ మార్కెట్లో తిరుగతున్న కస్టమర్లు బెంబేలెత్తిపోయారు. దాన్ని వెంటనే తీసుకెళ్లిపోవాలని ఆ వ్యక్తిని కోరారు. స్థానిక సెక్యూరిటీ సిబ్బంది కూడా అతడిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది.

ఇంగ్లాండ్‌లోని బ్రిగ్టాన్ సిటీ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 12 అడుగుల పొడవైన కొండ చిలువను మెడలో వేసుకుని దర్జాగా మాల్‌లో నడుస్తూ కనిపించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ప్రశ్నించారు. ఎరిక్ సెల్బే అనే వ్యక్తి ఇదంతా తన కెమేరాలో రికార్డు చేశాడు.

ఈ సందర్భం ఎరిక్ మాట్లాడుతూ.. ‘‘ఎవరో మార్కెట్లో పామును చూశామని చెప్పడం విన్నాను. అదేదో చిన్న పాము కావచ్చని అనుకున్నా. దగ్గరకు వెళ్లి చూస్తే అది పెద్ద కొండ చిలువ నేలపై పాకుతూ కనిపించింది. పసుపు రంగులో ఉన్న ఆ పామును చూసి.. కొండ చిలువ అనుకోలేదు. దగ్గరకు వెళ్లిన చూసిన తర్వాతే తెలిసింది’’ అని తెలిపాడు. పోలీసులు అతడిని మందలించి అక్కడి నుంచి పంపేశారని తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. చాలా మంది నెటిజనులు ఈ వీడియో ని షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇదిగో మీరు ఈ వీడియోని ఒకసారి చూసేయండి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: