బీజేపీ అభ్యర్థినిగా స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగిన తర్వాతే ఆమె పేరు ఫేమస్ అవుతోంది. ఆమె పోస్టర్లు చూసి.. కరోనా పేరు వాడేసుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు.కానీ, ఆమెకు ఆ పేరు చిన్నప్పుడే పెట్టారు. ఆమె తండ్రి థామస్ ఫ్రాసిస్ కవల పిల్లలైన కరోనా, ఆమె సోదరుడికి సరికొత్త పేరును పెట్టాలని భావించారు. ఇందులో భాగంగా ఆమెకు కరోనా థామస్ అని, తమ్ముడికి కొరాల్ థామస్ అని పేరు పెట్టారు. ‘కరోనా’ అంటే ‘హెలో’ అనే అర్థం కూడా ఉందట. అందుకే, ఆమెకు ఆ పేరును పెట్టారట.
ఈ సందర్భంగా కరోనా స్పందిస్తూ.. ‘‘కరోనా వ్యాపిస్తున్న కొత్తలో చాలామంది ‘గో కరోనా’, ‘కిల్ కరోనా’ అనే నినాదాలు చేసేవారు. అవి వింటుంటే చాలా చిరగ్గా అనిపించేది. నా పేరును వైరస్‌కు పెట్టడం వల్లే ఈ సమస్యంత అని సరిపెట్టుకున్నా. అయితే, ఎన్నికల ప్రచారంలో మాత్రం ఈ పేరు నాకు బాగానే ఉపయోగపడుతోంది. ఇప్పుడు అంతా నన్ను ఆ పేరుతోనే పలకరిస్తున్నారు. తప్పకుండా నాకు ఓట్లు లభిస్తాయనే భావిస్తున్నా’’ అని తెలిపారు. కరోనా థామస్‌కు కోవిడ్-19కు గురైంది. ఆ సమయంలో ఆమె గర్భవతి అట. కాని ఆ దేవుడి దయ వలన తల్లి బిడ్డ ఆ వైరస్ నుంచి ఆరోగ్యంగా బయటపడ్డారు.ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...