వాషింగ్టన్: 1960-70 దశకాల్లో ఉత్తర క్యాలిఫోర్నియాలో వరుస హత్యలు చేసి అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నాడు. హత్యలు చేయడమే కాకుండా తనను పట్టుకోమని ఛాలెంజ్ చేస్తూ పోలీసులకు కోడ్స్ కూడా అందించేవాడు. అప్పట్లో అదో సంచలనం. అతడు ఇచ్చే క్లూలన్నీ జోడియాక్(రాసిఫలాలు) ఆకృతుల్లో ఉండడంతో అప్పట్లో అతడికి జోడియాక్ కిల్లర్‌గా నామకరణం చేశారు. అయితే అతడిని పట్టుకోవడం ఎవరి తరమూ కాలేదు.

ఎంతో మంది ఆఫీసర్లు ఆ జోడియాక్ కిల్లర్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అహోరాత్రులూ శ్రమించారు. కానీ వారి వల్ల కాలేదు. అతడిని పట్టుకోవడం పక్కనపెడితే.. కనీసం ఆ కిల్లర్ ఇస్తున్న కోడ్స్‌లోని రహస్యాన్ని బయటకు తీయడం కూడా వారికి చేతకాలేదు. ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపించి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అప్పటి నుంచి ఆ జోడియాక్ కిల్లర్ ఎంత మిస్టరీనో.. అతడి కోడ్స్ కూడా అంత మిస్టరీగానే మిగిలిపోయాయి. విచిత్రం ఏంటంటే.. జోడియాక్ కిల్లర్ అనే సీరియల్ కిల్లర్ నిజంగా ఒకడేనా..? లేక అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా..? అనే విషయంలో కూడా అమెరికన్ పోలీసులకు తెలియదు.

అయితే సరిగ్గా 51 ఏళ్ల తరువాత ఆ కోడ్స్‌లో ఏముందో అమెరికాకు చెందిన ఓ నిపుణుల బృందం కనిపెట్టింది. 1969లో జోడియాక్ కిల్లర్ పంపినట్లు చెప్పుకుంటున్న ఓ న్యూస్ పేపర్‌లోని ‘340 సిఫర్’ కోడ్‌ను శాస్త్రవేత్తలు ఛేదించారు. ఈ కోడ్‌లో 360 గుర్తులు ఉంటాయి. అందుకే దీనిని ఈ పేరుతో పిలుచుకుంటారు. ఈ కోడ్‌ను సాల్వ్ చేసిన డేవిడ్ ఒరాంచక్ అనే శాస్త్రవేత్త ఇందులోని విషయాన్ిన ప్రపంచానికి తెలియజేశారు.

 ‘నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడం మీకు సంతోషంగా ఉందనుకుంటా..!’ అని రాసి అందులో రాసి ఉందట. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పటికైతే ఈ కోడ్‌ను ఛేదించారు. అయితే జోడియాక్ కిల్లర్ పంపిన ఇలాంటి కోడ్స్‌ ఇంకా ఉన్నాయి. మరి వాటన్నింటిని ఎప్పటికల్ల ఛేదిస్తారో చూడాలి. అయితే ఒకవేళ కోడ్స్ అన్నీ ఛేదించినా ఇప్పటికే ఆ కిల్లర్ చనిపోయి కూడా ఉండోచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: