పూణే కు చెందిన ఆభరణాల వ్యాపారి కు షాపు ఉంది. ఇదంతా గమనించిన ఓ నిందితుడు.. ఆ ఆభరణాల వ్యక్తితో నమ్మించి మోసం చేశాడు. ఓ రోజు ఆ నిందితుడు బంగారపు ఉంగరం కొనడానికి షాప్ కి వెళ్లి ఆ వ్యాపారిని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ వ్యాపారి అతనిని గుడ్డిగా నమ్మాడు. ఆ నిందితుడు ఆ వ్యాపారస్తుడు కి అవసరమైన వస్తువులను, పాల ఉత్పత్తులను, బియ్యం వంటి ఇతర వస్తువులను అందించేవాడు. ఇలా ఒక సంవత్సరం పాటు చేసి తనను వెన్నుపోటు పొడిచాడు.
మ్యాజిక్ సాండ్ పేరుతో బంగారం తయారవుతుందని ఆ వ్యాపారి కు మాయమాటలు చెప్పి నమ్మించాలి. తాను తీసుకువచ్చిన మహిమగల ఇసుకను మండితే బంగారం తయారవుతుందని తెలిపాడు. దీంతో నాలుగు కిలోల ఇసుకను బంగారం తయారవుతుందని చెప్పి అతని వద్ద రూ.50 లక్షలు వసూలు చేసుకున్నాడు. ఆ వ్యాపారస్తుడు కూడా అజ్ఞానంతో అతని మాటలు విని రూ.30 లక్షల నగదును, రూ.20 లక్షల బంగారం ను ఇచ్చాడు. కాగా వ్యాపారస్తుడు ఆ మ్యాజిక్ గురించి అసలు విషయం తెలుసుకున్నాడు. ఇదంతా మోసమని తెలిసి బోరుమని విలవిలలాడుతూ పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చేస్తున్నారు.