తాజాగా తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం అందాల నటి, ముద్దుగుమ్మ యాంకర్ అనసూయను గౌరవిస్తూ ఆమె ఫోటోతో ఉన్న ఒక పోస్టల్ స్టాంపుతో గౌరవించారు. ఈ సందర్భంగా ఎంతో ఆనందంలో ఉన్న అనసూయ ఈ ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ చిత్రపురి చలన చిత్రోత్సవానికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసింది.
ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. "జీవితంలో ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది. నేనేం చేశానో నాకు తెలియదు కానీ నాకు ఇలాంటి గౌరవం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి గొప్ప పనులను చేయడం కోసం తన వంతు సాయంగా ఏమైనా చేస్తానాని ప్రతిజ్ఞ చేస్తున్నానంటూ" కొంతవరకు ఎమోషనల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు ఎంతో గౌరవప్రథమైన స్టాంపుల పై అనసూయ ఫోటోను చూసేటప్పటికి కొంతవరకు షాక్ కి గురయ్యారు.అంతేకాకుండా ఈ స్టాంపుల పై అనసూయ ఫోటో చూడగానే మరికొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ "థాంక్యూ బ్రదర్" అనే సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.