ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి  ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో పాటు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ రెండు చిత్రాలు 2021 లోనే విడుదల కాబోతున్నాయి. ముందుగా ‘ఆచార్య’ చిత్రం మే 13న విడుదల కాబోతుంది. చిరు -కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్ 45నిమిషాల నిడివి గల పాత్రను చేస్తున్నాడు. ఇక ఆయన రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.


అయితే చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తరువాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ లతో చరణ్ తదుపరి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు అఫిషియల్ గా ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ ను స్టార్  ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ప్రస్తుతం ఈయన చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు గురించే శంకర్ తో డిస్కషన్లు జరుపుతున్నాడట. పాన్ ఇండియా మూవీగానే ఈ ప్రాజెక్టు రూపొందుతోందని సమాచారం.


అయితే రాజమౌళి సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ చెయ్యడం కోసం ఏకంగా 2 సంవత్సరాలు సమయం కేటాయించిన రామ్ చరణ్.. ఇప్పుడు శంకర్ తో మూవీకి కూడా 2 సంవత్సరాల వరకూ డేట్స్ ఇస్తాడా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే శంకర్ తో చరణ్ చెయ్యబోయే చిత్రం ఏడాది లోపే పూర్తి చెయ్యాలనేది అగ్రిమెంట్ అని సమాచారం అందుతుంది. నిజానికి ‘ఇండియన్2’ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మించాలని ట్రై చేసాడు. కానీ చివరి నిమిషంలో తప్పుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: