వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి బైక్ పై ముగ్గురు పెద్దవాళ్ళు నలుగురు పిల్లలతో కలిసి ఇలా జంబో ఫ్యామిలీతో బైకుపై వెళ్తుండగా పోలీసుల తనిఖీలో భాగంగా మల్లేశం అని కానిస్టేబుల్ కంట పడ్డాడు. ఆ పోలీస్ కానిస్టేబుల్ అతనిని అడ్డుకొని"అయ్యా.. నీకో దండం.. ఇది బైక్ అనుకున్నావా లేక ఎడ్ల బండి అనుకున్నావా"?ఒకేసారి ఇంతమందిని వేసుకొని ప్రయాణిస్తున్నావు అంటూ అతనికి 12 వందల రూపాయల జరిమానా విధించాడు.
ఈ విధంగా ఆవ్యక్తి ఏడుగురు కుటుంబ సభ్యులను బండి పై తీసుకెళ్తున్న ఫొటోను పోలీసులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా అధిక సంఖ్యలో బండి పై ప్రయాణిస్తే ప్రమాదాలకు గురి కావచ్చని, అలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొందరిలో ఎటువంటి మార్పులు రాకపోవడానికి ఈ ఫోటో నిదర్శనమని చెప్పవచ్చు.