దేవాలయంలో ఏంటి..? లిక్కర్ ప్రసాదంగా పోయడం ఏంటి..? ఏమైనా ఆటలాడుతూ ఉన్నారా..? అని మనలో కొంతమంది ఆశ్చర్యానికి గురి అయితే..? మరికొంతమంది కోపం తెచ్చుకుంటూ ఉంటారు..? మీరు ఆశ్చర్యపోయినా లేదా కోపం తెచ్చుకున్న అదే నిజం.. ఎందుకంటే అక్కడ ఒక దేవాలయంలో ప్రసాదంగా లిక్కర్ పోస్తారట..!  సాధారణంగా మనలో చాలామంది భక్తి కన్నా ప్రసాదం కోసం దేవాలయాలకు వెళుతూ ఉంటారు. దానికి కారణం దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం ఎంతో రుచికరంగా  ఉంటుంది కాబట్టి. మరీ ముఖ్యంగా ప్రసాదాలు అనగానే మనకు గుర్తొచ్చేవి లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, పెరుగన్నం ఇలాంటివి పెడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక దేవాలయంలో మాత్రం ఏకంగా లిక్కర్ ను ప్రసాదంగా పోవడం విశేషం. కేవలం భక్తులకు మాత్రమే ప్రసాదంగా లిక్కర్ పోవడమే కాకుండా, భగవంతుడికి కూడా లిక్కర్ ని ప్రసాదంగా సమర్పిస్తారో ముఖ్యంగా మనం ఏ దేవాలయంలో ఏ ప్రసాదాలకు ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం.

అన్నవరం సత్యనారాయణ:
ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి కి పెట్టే ప్రసాదం లో, ఆకులో ప్రసాదం పెట్టి ఇస్తారు. అయితే ప్రసాదం తినేటప్పుడు ఆకును కూడా నాకాలి అనేది సాంప్రదాయం..

తిరుపతి :
తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో లడ్డూకు చాలా ఫేమస్. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే చాలు..లడ్డు కోసం ఎదురుచూస్తూ ఉంటారు మిగతా వాళ్ళు.

అజహర్ కోవిల్ :
ఇక్కడ ఈ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా దోశ ఇస్తారు. ఇందుకు కారణం అక్కడి రైతులు వరి పంటకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దోశ ప్రసాదంగా ఇవ్వడం అక్కడి సంప్రదాయం .

 శబరిమల :
శబరిమలలో అయ్యప్ప స్వామికి ప్రసాదం అరవన పాయసం ఇవ్వడం విశేషం. అయితే ఈ ప్రసాదం ఒక స్పూన్ దొరికినా చాలు అని అనుకునే వారు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే ఆ ప్రసాదం తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి.

జగన్నాథ్ టెంపుల్ :
ఇక జగన్నాథ్ టెంపుల్ లో ఏకంగా ఏ దేవాలయంలోని పెట్టని రకంగా మొత్తం 56 రకాల ప్రసాదాలు వడ్డిస్తారు. ఇక ఎవరైనా గుడికి వెళ్లి వచ్చిన తర్వాత ప్రసాదం గురించి జరిగే చర్చ ఒక రేంజ్ లో ఉంటుంది.

కాలభైరవ మందిరం:
ఉజ్జయినిలోని ఉండే ఈ కాలభైరవ మందిరం లో ప్రసాదం కాస్త భిన్నం. ఎందుకంటే ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు.

కాబీస్ బాబా గుడి :
ఇది ఉత్తర ప్రదేశ్ లో ఉంటుంది. ఈ గుడిలో కూడా లిక్కర్ ను ప్రసాదంగా ఇస్తారు.

వైష్ణో దేవి మందిరం :
ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక ఇక్కడ నాలుగు రకాల ప్రసాదాలు ఇస్తారు. షుగర్ బాల్స్, రైస్, డ్రై యాపిల్,కొబ్బరి లను ప్రసాదంగా ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: