దొంగలు అన్నాక దొరికిన కాడికి దోచుకోవడం కామన్.కొంతమంది దొంగలు అయితే చాలా అంచనాలతో ఇంట్లో చొరబడి ఎక్కువ మొత్తం సొమ్ములని దోచుకుంటారు. ఇక వారు ఆ ఇంట్లో చాలా సొమ్ములుంటాయని భావిస్తారు. అక్కడ ఆశించిన మొత్తం దొరక్కపోతే నిరుత్సాహపడతారు. అయితే, ఈ దొంగ మాత్రం పెద్దగా అంచనాలేవీ లేకుండానే దొంగ తనానికి వెళ్లాడు. అక్కడ తాము ఆశించిన మొత్తం కంటే ఎక్కువ నగదు దొరకడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆనందం ఎక్కువ కావడంతో గుండె నొప్పితో ఆస్పత్రిపాలయ్యాడు. చివరికి ఆ దొంగిలించిన మొత్తాన్ని తన చికిత్సకే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఫిబ్రవరి నెలలో జరిగిన ఓ చోరీ కేసులో పోలీసులు ఇటీవల ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మ్ వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 16 అర్ధరాత్రి ఇద్దరు దొంగలు నవాబ్ హైదర్ అనే వ్యక్తికి చెందిన పబ్లిక్ సర్వీస్ సెంటర్‌‌లోకి చొరబడ్డారు. సుమారు రూ.7 లక్షలు, మరికొన్ని విలువైన వస్తువులను దొంగిలించారు. హైదర్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఆ దొంగతనానికి ఒడిసిగట్టిన దుండగులు నౌషద్, అజాజ్‌గా గుర్తించడం జరిగింది.



మొదట పాపం వారు అక్కడ వేలల్లో మాత్రమే సొమ్ము ఉంటుందని అనుకున్నారట. అయితే, అక్కడ ఊహించిన దాని కంటే ఎక్కువ నగదు కనబడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.దొంగ తనం తర్వాత ఇద్దరు దొంగలు కూడా దొంగిలించిన ఆ సొమ్మును సమానంగా పంచుకోవడం జరిగింది.ఆ తర్వాత అజాజ్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో అతడు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. ట్రీట్మెంట్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశాడు. నౌషద్ మాత్రం ఆ డబ్బులను బెట్టింగులో పెట్టాడు. నిందితుల నుంచి పోలీసులు రూ.3.7 లక్షలు, రెండు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రూ.5 వేలు చొప్పున రివార్డు ప్రకటించడం జరిగింది.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: