మహిళలకు ఇంటా, బయటనే కాదు.. పని చేసే చోట కూడా రక్షణ లేకుండా పోతుంది. సమాజంలో మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.. పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి మగ మృగాలను దారుణంగా శిక్షిస్తున్నారు. పని చేసే చోట బాస్ ఇలాంటి వేదింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ లెక్క చెయ్యకుండా ఓ వ్యక్తి అశ్లీల ఫోటోలను ఉద్యోగికి పంపాడు. అది నచ్చని ఆమె బాస్ అని కూడా చూడకుండా చితకబాదింది.. 


ఈ ఘటన చైనా లో వెలుగు చూసింది.. అయితే ఆడదాన్ని అలుసుగా చూసి అసభ్య సందేశాలు పంపితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపించిందో మహిళ. చైనాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ అధికారి వాంగ్‌ ఆ ఆఫీస్‌లో స్వీపర్‌గా పనిచేసే మహిళతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమెనే కాకుండా.. ఆఫీసులోని చాలా మంది మహిళలతోను ఇలానే ప్రవర్తించేవాడు.అతని బాధలు పడలేక అక్కడి నుంచి చాలా మంది మహిళలు వేరే ఉద్యోగాలకు మారిపోయేవారు. ఒకరోజు వాంగ్‌ ..జో అనే మహిళకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపించాడు.


మొదట్లో ఉద్యోగం కోసం ఉరుకున్నా ఆ బాస్‌పై తిరగబడింది. తన సహచరులతో కలసి అతని క్యాబిన్‌కు వెళ్లింది. నేలను తుడిచే గుడ్డ కర్ర తో అతడిని చితక్కొట్టింది.తోటి ఉద్యోగులు వీడియో తీశారు. ఇప్పుడది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆమె చేసిన ధైర్యానికి తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు హ్యట్సాఫ్‌.. బాగా బుధ్ది చెప్పావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన తర్వాత అక్కడి ప్రభుత్వం ఆ ఉద్యోగిని విధుల నుంచి తోలగించడమే కాక అతనిపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అంతేకాదు ఆ మహిళ చేసిన పని నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: