మే డే అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు ను గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ రోజును అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా పిలుస్తారు. చాలా దేశాలలో లో మే 1 న కార్మికుల పోరాటం, ఐక్యతను గుర్తించి వారి సేవలకు గాను కొన్ని అవార్డులు ప్రధానం కూడా చేస్తారు. కొంత మంది మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మలిచారు. ముఖ్యంగా చికాగోలో ఉన్న కొంతమంది రక్తతర్పణం చేసి, తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.
ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో " మేము కూడా మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. మేము ఈ వెట్టిచాకిరీ చేయలేము. 24 గంటలలో 8 గంటలు పని, మరో ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు రిక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు" . ఇదంతా పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు.
1862 లో భారత్ లో కార్మికుల సమ్మె:
యాంత్రిక యుగం రాకముందు మనిషి ఎక్కువ గంటలు పనిచేసేవాడు. హలో బానిసత్వం లోని మగ్గి పోయేవారు. మనిషి తన విజ్ఞాన పరిశోధనలతో యంత్రాలను సృష్టించుకున్నాడు. దీనితో పాటు సామాజిక వర్గం లో చైతన్యం కూడా పెరిగింది. అందువల్లనే పనిగంటలు పోరాటం వచ్చింది. భారతదేశంలో చికాకు కంటే ముందు కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్ లో 1862 లో సమ్మె చేశారు. అంతవరకూ ఆ రైల్వే కార్మికులు 10 గంటల పాటు పనిచేసే వారు. అప్పట్లో బెంగాల్ పత్రికలో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలు పని చేస్తామంటూ డిమాండ్ చేశారు కార్మికులు. కానీ అది ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఈ సంఘటన కూడా ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదని చెప్పవచ్చు.
ఇక 1923 లో తొలిసారిగా భారత్ లో మే డే:
1923 లో తొలిసారిగా భారత్ లో మే డే ను పాటించడం మొదలుపెట్టారు. 1920 లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం వల్ల అప్పట్నుంచి కార్మికులలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి మే డే ను పాటించడం జరిగింది. ఐటీ రంగాల్లో ఎంతో మంది ఆడపిల్లలు, యువకులు పని చేస్తున్నారు. ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. ఇతర దేశాలలో ఉన్న కంపెనీలు అక్కడ ప్రజా చైతన్యం ఉన్నది కాబట్టి. ఇండియాలో కంపెనీలు పెడుతూ వచ్చేవాళ్లు. అంతేకాకుండా వీళ్లు 10 నుంచి 12 గంటల వరకు పని చేయించేవారు.
1886 లో ఆరంభమైన ఈ ఉద్యమం వందేళ్ల పండుగ జరుపుకుంది. ఎనిమిది గంటల పని కోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుంది అనుకున్నారు. కానీ మార్కెట్ శక్తులు మళ్లీ పాత పద్ధతిలోనే ప్రాణప్రతిష్ట చేసుకున్నాయి. చాలా దేశాలలో మే డేని సెలవుదినంగా కూడా ప్రకటించారు.
1886 లో షికాగోలోని "హే "మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మే డే పుట్టుకకు పునాది వేసింది అని చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలలో మే 1న సెలవు దినంగా ప్రకటించడం మొదలుపెట్టారు. ఇక అనంతరం అనేక దేశాలు అదే బాటలో నడిచాయి. పలు దేశాలలో కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను ఆరోజున అమలులోకి రావడం మొదలయ్యాయి. భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మే డే నీ సెలవు దినంగా ప్రకటించారు.