క్రూర జంతువైన సింహాన్ని మృగాలకు రాజుగా వర్ణిస్తారు. సింహాలు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోని మైదానాల్లో నివసిస్తుంటాయి. సింహాలు సాధారణంగా 5 నుంచి 8 అడుగుల పొడవు, 150 నుంచి 250 కిలోల వరకు బరువు కలిగి ఉంటాయి. సింహాలు ఎక్కువగా రాత్రుల్లోనే వేటాడుతుంటాయి. జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలను వేటాడి ఆహారంగా చేసుకుంటాయి. సింహాల్లో ఎక్కువగా ఆడ సింహాలే వేటాడుతుంటాయి.

చిరుత పులులు వేగానికి పెట్టింది పేరు. చిరుతపులి క్షణాల్లోనే ఏ జంతువునైనా వేటాడగలదు. చిరుతపులి గంటకు 80 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలదనే ఓ అంచనా ఉంది. అలాంటి సామర్ధ్యం ఉన్న చిరుత మృగరాజైన సింహంతో పోట్లాడితే ఎలా ఉంటుంది. ఓసారి ఊహించుకోండి. ఈ రెండు జంతువులు పోట్లాడుకున్న దృశ్యాలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహం, చిరుత లాంటి రెండు సమవుజ్జీలు తలబడితే.. ఆ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించగలం. ఇప్పుడు వాటి మధ్య జరిగిన యుద్ధాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోలో చిరుత పులి నేలపై పడుకుని ఉంది. దిగువన గుంతలా కనబడుతున్న చోటు నుంచి సింహం మెల్లగా అక్కడకు వచ్చింది. చిరుతను అలానే చూసింది. ఒక్కసారిగా పులి పైకి సింహం దూకింది. వెంటనే అలర్ట్ అయిన చిరుతపులి సింహంపైకి ఎదురుతిరిగింది. చిరుత ఎత్తు నుండి కిందపడగా.. సింహం అక్కడి నుంచి చిరుత వెంటపడుతూ కిందికి దూకింది. ఈ వీడియో ‘ఆఫ్రికన్ యానిమల్స్’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయబడింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా షేర్ చేశారు. దీంతో ఆ వీడియోకు 52 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై నేను చిరుతపులలకు భయపడను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. శత్రువు నుంచి పారిపోతున్న సమయంలో ఎప్పుడూ శత్రువుపై ఓ కన్నేసి ఉంచాలని.. లేకపోతే ఇలా దాడి చేసినప్పుడు తప్పించుకోలేం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

సింహం లాంటి జంతువుతో పోరాడాలంటే చాలా ధైర్యం, శక్తి కావాలి. అడవికి రాజైన సింహాన్ని మనం ఎంతో దూరం నుంచి చూసినా భయపడిపోతాం. సింహం గర్జన వింటే చాలు మిగిలిన జంతువులకు వణుకుపుడుతుంది. సింహం నుంచి తప్పించుకోవడం అంత సులువైన పని కాదు. సింహం తన బలాన్ని ప్రదర్శిస్తూ ఆటవిక రాజ్యాన్ని ఎప్పటినుంచో శాసిస్తూ వస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: