ఇటీవల కాలంలో చాలామంది కరోనా బారిన పడుతున్నప్పటికీ అందులో కొందరు మాత్రమే కరోనా ను జయిస్తున్నారు. మరి కొంతమంది ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. అందుకే ఇలాంటి సమస్యలను పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వం వయసుపైబడిన వారికి ముందుగా వ్యాక్సిన్లను అందించింది. ఎందుకంటే వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా వుంటుంది. ఇక వ్యాక్సిన్ వేయడం వల్ల వీరిలో వైరస్ తో పోరాడే యాంటీ బాడీలు ఉత్పన్నం అవుతాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు చాలా మందిలో ఉన్న అనుమానం ఏమిటంటే , కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా కరోనా బారిన పడితే ఆసుపత్రికి వెళ్లాలా ?లేదా ? అని ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా బారిన పడితే ఆస్పత్రులకు వెళ్ళలా వద్దా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.
కానీ ఇటీవల తాజాగా జరిగిన ఒక సర్వేలో మాత్రం అంత అవసరం లేదనే విషయం బయటకు వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 0.06 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లే అవసరం ఉంటుందని, టీకాలు తీసుకున్న వారు 97.38శాతం మంది వైరస్ నుంచి రక్షణ పొందారని "ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్" అధ్యయనం వెల్లడించింది.. కోవిడ్ 19 బ్రేక్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెన్సీని అంచనా వేయడానికి ఆస్పత్రి వర్గాలు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. అంటే వ్యాక్సిన్ తీసుకున్న మొదటి వంద రోజుల్లో ఈ అధ్యయనం చేశారు. అలా పరిశోధనలు జరిపిన తరువాత వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా వైరస్ సోకితే ఆస్పత్రికి వెళ్లే అవకాశం చాలా వరకు రాలేదని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ సిబల్ ఈ విషయాలను వెల్లడించారు..
అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ అనేది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఈ సర్వే గుర్తించింది. అపోలో హాస్పిటల్ ముఖ్యంగా 3,235 మంది ఆరోగ్య కార్యకర్తల పై అధ్యయనం చేసింది. ఇందులో మొత్తం 85 మంది ఈ అధ్యయన సమయంలో కరోనా బారినపడ్డారు. వీరిలో 25 మందికి పూర్తిగా టీకాలు వేయగా, 20మందికి పాక్షికంగా టీకాలు వేశారు.. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారికి ఎక్కువగా వీరిలో కరోనా సోకిందని, వయసుతో సంబంధం లేకుండా కరోనా బారిన పడ్డారని గుర్తించారు.. కరోనా తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఈ టీకా ఎదుర్కొంటుందని ఈ సర్వేలో గుర్తించారు..