అప్పుడ‌ప్పుడు జ‌రిగే కొన్ని వింత‌లు, విశేషాలు నిజంగా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి. అవి జ‌రిగిన తీరును చూస్తే ఏదైనా దైవ‌శ‌క్తి కార‌ణ‌మేమో అన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. ఇప్ప‌టికే ఇలాటి ఘ‌ట‌న‌లు అనేకం జ‌రిగాయి. వాటిని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తే ఇక వేలాది కామెంట్లు, ల‌క్షల వ్యూస్ ఎక్క‌డికీ పోవు. ఇక చెట్లు వింత ఆకారం ఉండ‌టం, లేదా ఒక చెట్టుకు ఇంకో చెట్టు పండ్లు కాయడం లాంటివి అనేకం మ‌న‌ల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి.

మొన్న‌టికి మొన్న హిమాచల్ ప్ర‌దేశ్‌లో రావిచెట్టుకు మామిడి పండ్లు కాసాయంటూ ఒక ఫొటో సోష‌ల్ మీడియాలో ఎన్నో చెక్క‌ర్లు కొట్టింది. కానీ చివ‌ర‌కు అది ఫేక్ అంటూ క్లారిటీ వ‌చ్చింది. కానీ కొన్ని ఘ‌ట‌న‌లు మాత్రం నిజంగానే జ‌రుగుతుంటాయి. త‌వ్వ‌కాల్లో దేవుడి ఆకారంలో విగ్రహాలు బ‌య‌ట‌ప‌డ‌టం, కొబ్బ‌రి చిప్ప‌లో వింత ఆకారాలు క‌నిపించ‌డం, కొన్ని కాయ‌లు దేవుడి రూపంలో ఉండ‌టం లాంటివి నిజంగానే చాలా వ‌ర‌కు జరిగాయి.

ఇక జంతువుల్లో అయితే ఇలాంటి కోకొల్ల‌లు. ఒక జంతువుకు ఇంకో జంతువు ఆకారంలో ఉన్న పిల్ల‌లు పుట్ట‌డం, లేదా ఒకే జంతువుకు రెండు త‌లలు, లేదా వింత ఆకారంలో పుట్ట‌డం లాంటివి ఎన్నో వీడియోలు మ‌నం చూసే ఉంటాం.ఇ క ఇప్పుడు కూడా అలాంటి వింత ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. అది కూడా జంతువుల్లోనే జ‌రిగిందండోయ్‌. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

వాస్త‌వానికి వింత ఆకారంలో ఆవు దూడలు, మేక పిల్లలు పుట్ట‌డం చాలా కామ‌న్‌గానే జ‌రుగుతుంటాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటన నిర్మల్ జిల్లాలో చోటు జ‌ర‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. భైంసా మండలం సుంక్లి గ్రామంలో ఓ వ్య‌క్త‌కి చెందిన మేక‌కు వింత మేకపిల్ల జన్మించింది. అచ్చం మనిషిని పోలినట్టు ఉంన్న పిల్లను మేక ప్రసవించించింది. ఆ మేక పిల్ల‌కు తల , కాళ్లు, చేతులు అచ్చం మనిషిని పోలినట్టే ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ వింత మేక పిల్ల‌ను చూడటానికి ఎగ‌బ‌డి తరలిస్తువస్తున్నారు. కాగా ఈ వింత మేక పిల్ల‌ పుట్టిన కొద్ది సేపటికి ప్రాణాలు విడిచింద‌ని తెలుస్తోంది. ఇలాంటి వింత శిశువు జన్మించడానికి జన్యు ఉత్పరివర్తనాలు కారణం కావ‌చ్చ‌ని చెబుతున్నారు పశువైద్య డాక్ట‌ర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: