
ఇక జూన్ 7వ తారీఖున నిందితురాలు సావో తన భర్త ఆండ్రీతో గొడవపడింది.గొడవ పడిన తర్వాత ఆ ఇంటి నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. తన భర్త ఆండ్రీ ఆర్తనాదాలు పక్కన ఇంట్లోవారికి కూడా వినిపించాయి. అయితే, వారు ఇద్దరు కూడా ఎప్పుడూ ఎదో ఒక గొడవతో పోట్లాడుకుంటూనే ఉంటారనే ఉద్దేశంతో పోరిగింటోళ్ళు పట్టించుకోలేదు. ఇక జరిగిన ఆ గొడవ తర్వాత ఆండ్రీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారట.
ఫిర్యాదు ద్వారా నిజం తెలుసుకున్న పోలీసులు సావో ఇంటికి వెళ్లారు..ఇక ఆ ఇంట్లో నగ్నంగా రక్తపు మడుగులో పడివున్న ఆండ్రీ కనిపించాడు. అప్పటికే సావో తన భర్త శరీరాన్ని ముక్కలుగా చేసింది.ఇక తన భర్త మర్మాంగాన్ని కోసి శరీరం నుంచి వేరు చేసి వంటగదిలో పెనంలో సోయాబీన్ ఆయిల్ వేసి బాగా వేయించినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ దారుణమైన హత్య జరిగి ఉండవచ్చని తెలిపారు.
ఇక ఈ షాకింగ్ ఘటనపై సావో తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ సావోను తన భర్త ఆండ్రీ చంపేందుకు ప్రయత్నించాడని,ఇక ఆమె కేవలం ఆత్మ రక్షణ కోసమే ఎదురుదాడి చేసిందని తెలిపాడు. ఇక ఆ పెనుగులాటలో ఆండ్రి చనిపోయాడని వాడించాడు. అయితే,ఆమె ఆ హత్య తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అతడి శరీరాన్ని ఎందుకు ముక్కలు చేసింది? అదీగాక అతడి మర్మాంగం కోసి దానితో కూర ఎందుకు వండిందనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానాలు చెప్పలేదు. సావో, ఆండ్రీలు ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉండేవారని, ఇక ఆరోజు హత్య జరిగిన రాత్రి వారు స్నాక్ బార్‌కు వెళ్లి వచ్చారని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే, ఈ దారుణమైన హత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియలేదు.