యూరప్‌ ఖండంలోని సెర్బియా దేశంలో మన యూట్యూబర్‌పై ఓ కాకి పగబట్టింది.ఆ కాకి నన్ను చంపాలని చూస్తోంది.ఆ కాకి గోల భరించలేక నేను చచ్చిపోవాలి అనుకున్నా... అంటూ ఆ తెలుగు యూట్యూబర్ అన్వేష్ తన అవస్థలను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రపంచ ట్రావెలర్ అయిన అన్వేషన్... సెర్బియాలోని ఓ హోటల్‌లో దిగాడట. అక్కడ అన్వేష్ ని ఓ కాకి చూసింది. ఇక అంతే ఆ రోజు నుంచి అన్వేష్ బట్టలు గుర్తు పట్టేసి...అతను ఎక్కడికి వెళ్లినా వెంటపడుతూ అరుస్తోంది అని అన్వేష్ చెప్పాడు. ఆ కాకి నన్ను వదలట్లేదు అంటూ తన బాధని చెప్పుకుంటున్నాడు.

"ఇక ఆ కాకి నేను ఎక్కడికి వెళ్లినా అరుస్తోంది. రెస్టారెంట్‌కి వెళ్లిన అరుస్తోంది. అలాగే మార్కెట్‌కి వెళ్లినా అంతే అరుస్తుంది. ఎక్కడికి వెళ్లినా ఆ కాకి వెంటాడుతోంది. అసలు ఆ కాకి ఎందుకు అరుస్తోందో, ఎందుకు వెంటపడుతోందో నాకేం అర్థం కావట్లేదు. ఇక నా బట్టలు, నా క్యాప్, నా కళ్లజోడు వల్ల అది అలా అరుస్తుందేమో." అంటూ ఆ వీడియోలో తన బాధ చెప్పుకున్నాడు అన్వేష్.

"ఇలాంటి ఘటనలు మనం సినిమాల్లో చూస్తుంటాం కానీ నా నిజ జీవితంలో జరగడం చిత్రంగా ఉంది. కనీసం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఏడు రోజులు దాని గోలతో బాధపడ్డాను. చివరకి నేనున్న ఆ ప్లేస్‌ని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.ఇక ఈ కాకి వల్ల బాధ పడ్డ నా బాధను ఆధారాలతో వీడియో చేశాను" అంటూ వీడియోను అన్వేష్ అనే ఈ తెలుగు యూ ట్యూబర్ యూట్యూబ్‌లో షేర్ చేశాడు.. చూశారు కదండీ అప్పుడప్పుడు ఇలా కాకులు కూడా మనుషులపై పగ బడుతూ ఉంటాయి. కాబట్టి కాకులతో జాగ్రత్త.ఆ వీడియో ఇప్పుడు నవ్వులు పూయిస్తూ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసి నవ్వుకోండి.



https://youtu.be/5bvZY0a71IQ



మరింత సమాచారం తెలుసుకోండి: