తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు తన తిరుమల కలను నిజం చేయబోతున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలోని అత్యంత ఖరీదైన దేవాలయాల ప్రాజెక్టులలో  యాదగిరిగుట్ట నిర్మాణం కూడా ఒకటి. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు విషమంగా మారడంతో, ఈ ప్రాజెక్టు నిర్మాణం కొంతవరకు వెనకబడిందని చెప్పవచ్చు. హైదరాబాద్ నుండి సరిగ్గా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం యాదగిరిగుట్ట. గత శతాబ్దాల కాలం నుండి లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ స్వయంభుగా నెలకొన్నారు అని ప్రసిద్ధి.

ఇక ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్టను ఏకంగా 1200 వందల కోట్ల రూపాయలతో భారీ పునరుద్ధరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. ఆయన ఎప్పటి నుండో ఈ దేవాలయాన్ని దేశంలోనే ప్రసిద్ధ దేవాలయంగా నిర్మించాలని కలలు కన్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ తీర్థయాత్రగా నెలకొల్పబడింది .ఇక అదే తరహాలో తెలంగాణలోని యాదగిరిగుట్ట కూడా ఒక ప్రసిద్ధ దేవాలయం గా నెలకొల్పాలని ఆయన ముఖ్య ఉద్దేశం.

యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీకి చెందినటువంటి ఒక అధికారి ఈ ప్రాజెక్ట్ గురించి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడుకొండలు ఉన్నట్టుగానే, ఈ యాదాద్రికి కూడా 8 కొండలు ఉన్నాయి. అయితే ఒక కొండ మొత్తం ఆలయం నిర్మించగా మరో రెండు కొండలను ఈ అభివృద్ధి కోసం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఇది భారీ ప్రాజెక్టు కాబట్టి కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని ముఖ్యంగా ఒక్కో కొండను ఒక్కో మహాద్భుతంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంటే అందులో ముఖ్యంగా ఒక ఉన్నత స్థాయి హోటల్స్, ఆస్పత్రులు, మాల్స్, వాణిజ్య ప్రాజెక్ట్ లను కలిగి ఉంటుందని, అలాగే సమీపంలో ఉన్న గ్రామాలలో జలాశయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఇక ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు చూసుకుంటే, అది మన భారతదేశంలో అయోధ్యలోని రామ మందిర్ ఆలయ ప్రాజెక్టు కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక ఈ యాదాద్రి గుట్టను స్వయంగా నిర్మించాలని, తెలంగాణ ముఖ్యమంత్రి వైటిడిఏ ను స్వయంగా నియమించుకున్నారు.  2016లో విజయదశమి రోజున ఈ ఆలయానికి సంబంధించిన మొదటి స్థంభం వేయబడింది. మొత్తం 25 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని, అతి త్వరలోనే నాలుగు ఎకరాలలో విస్తరించి, పునర్నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఇక మొత్తం ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం 1900 ఎకరాలను కూడా కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇందులో 250 ఎకరాల భూమిలో 160 కుటీరాలు, నిర్మాణం కోసం 1500 మందిని కార్మికులను నియమించారు. ఇక వారిలో ముఖ్యంగా 500 మంది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు  నుంచి శిల్పులు కూడా వుండడం మరో విశేషం. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణం 80 శాతం పూర్తి చేసుకుంది. ఇక కేసీఆర్ గత పది నెలల్లో రెండుసార్లు ఈ ఆలయాన్ని సందర్శించి, సుమారు 12  గంటలకు పైగా ఈ ఆలయంలోనే తన సమయాన్ని కేటాయించి, సూక్ష్మంగా ప్రణాళికను సిద్ధం చేస్తూ, నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: