కొంద‌రి ట్యాలెంట్ చూస్తుంటే వావ్ అనాల్సిందే. వారు చేసే విన్యాసాలు అలాఉంటాయి మ‌రి. ఇక మ‌న సాంప్ర‌దాయాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి గొప్ప సాంప్ర‌దాయాన్ని ఇప్ప‌టికీ కొంద‌రు కొన‌సాగిస్తున్నారు. అయితే జిమ్‌లో కూడా మ‌న సాంప్ర‌దాయాల‌ను కాపాడ‌టానికి ట్రై చేసిందిఓ డాక్ట‌ర‌మ్మ‌. అదేంటో ఇప్పుడు చూద్దాం.

మ‌న ఇండియ‌న్ భారతీయ చీరక‌ట్టుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంద‌న్న‌సంగ‌తి తెలిసిందే. కాగా కొంతమంది మహిళలు మాత్రం కష్టమైనా సరే ఈ పొడవైన చీరను క‌ట్టుకుంటున్నారు. చాలా మంది మహిళలు చీరలో అద్భుతమైన విన్యాసాలు చేసి అబ్బుర‌ప‌రుస్తున్నారు. చీర ధరించి డ్యాన్స్ చేయడంలో పాండిత్యం కలిగి ఉంద‌న్న విష‌యం తెలిసిందే.  అయితే కొంతమంది మహిళలు చీర ధరించి రేసులో కూడా ఈ మ‌ధ్య పరుగెత్తుతున్నారు. సాధారణంగా చీరలో ఇలాంటివి చేయ‌డం కొంచెం కష్టమని భావిస్తారు కానీ ఈ మ‌హిల‌ను చూసినప్పుడు విషయం భిన్నంగా కనిపిస్తుంది. డాక్టర్ షార్వారి వీడియో చూడటం ద్వారా చీర గురించి మీ ఆలోచనలు క‌చ్చితంగా మారిపోతాయ‌ని చెప్ప‌వ‌చ్చు.



సాధారణంగా ప్రజలు జిమ్‌కు వెళ్లడానికి ట్రాక్ సూట్లు లేదా ఇత‌ర వారికి సౌక‌ర్యంగా ఉన్న దుస్తులను కొనుగోలు చేసి వేస్తారు. కానీ పూణేకు చెందిన ఓ డాక్టర్ షార్వారీ మాత్రం వేరుగా ఆలోచించింది. ఆమె చీర క‌ట్టుకుని మ‌రీ జిమ్‌కు వెళ్తుంది. చాలా తేలికగా చీరలో భారీ బరువులు ఎత్తుతూ అబ్బుర ప‌రుస్తోంది. ప్ర‌స్తుతం చీరలో ఆమె చేసిన వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతోంది. 37 ఏళ్ల ఈ డాక్టర్ షార్వారీ ఇనామ్‌దార్ ఆయుర్వేద డాక్ట‌ర్‌గా చేస్తోంది. ఆమె ఫిట్‌నెస్‌పై చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాటి కోసం ఏకంగా ఆమె తన కోసం వ్యాయామం, ఆహారం దినచర్యను తప్పకుండా పాటిస్తుంది.



ఇక ఇప్పుడు డాక్టర్ శార్వారి జిమ్‌లో చీర క‌ట్టుకుని పుష్ అప్స్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జ‌నాలు చాలా షాక్ అవుతున్నారు. డాక్టర్ షార్వారీ చీరలో చాలా తేలికగా వర్కౌట్స్ చేయడం చూసి నిజంగానే అందరూ అబ్బ‌ర‌ప‌డుతున్నారు. ఇక అందరూ ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోను చూసిన ప్రజలు చాలా ఇంప్రెస్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ప్రజలు ఈ వీడియో క్లిప్‌ను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడంతోపాటుగా దానిపై వివిధ రకాల కామెంట్స్ చేస్తు లైక్‌లు కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: