ఇక తాజాగా ఉక్రెయిన్ చెందిన ఓ అందాల జంట తమ బంధాన్ని మరింత బలపరుచుకోవాలని ఆ ప్రయత్నంలో ప్రేమికుల దినోత్సవం నాడు ఏకంగా చేతికి సంకెళ్లు వేసుకుని మరీ కొత్త ప్రయోగం చేసింది ఆ జంట. కాగా ఎట్టకేలకు ఈ జంట వారి చేతికి ఉన్న సంకెళ్లను ఉక్రెయిన్‌కు చెందిన ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ ఎదుట తొలగించడం జరిగింది.
అయితే అలెగ్జాండర్ కుడ్లే(33), విక్టోరియా పుస్టోవిటోవా(29) అనే ఇద్దరు ఉక్రెయిన్ కు చెందిన యువ దంపతులు ఏకంగా 123 రోజుల వరకు తమ చెరో చేతికి సంకెళ్లు కలిపి వేసుకుని మరీ గడపడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. కిరాణా షాపింగ్ నుంచి మొదలుకుని బాత్రూమ్ లో షవర్ చేసుకోవడం దాకా ప్రతీదీ కలిసే చేశారంటే ఎంతలా ప్రేమించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఈ ప్రయోగం ద్వారా తాము కొన్ని అసౌకర్యాలను కూడా ఎదుర్కొన్నట్లు వారు వివరించారు.
అయితే ఈ విధంగా కలిసి ఉండటంతో తన ప్రియుడు తనపై అంత శ్రద్ధ చూపలేదని ఆమె స్పష్టం చేసింది. అందుకే తమ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇలా చేసినందుకు తాము చింతిస్తున్నట్లు అలెగ్జాండర్ వివరించారు. అనుకోకుండానే కొన్నిసార్లు విక్టోరియాకు అధికంగా కోపం వచ్చేదని అతడు తెలిపాడు. ఇక తాము చేసిన ఇలాంటి ప్రయోగం ఉక్రెయిన్, విదేశాలలో ఉండే జంటలు ఎవరూ చేయకుండా ఉంటే మంచిదని వారు సలహా ఇచ్చారు.