1). మొట్టమొదట ఒలింపిక్స్ క్రీడలు 8వ శతాబ్దంలో జరిగేవి. అంతేకాకుండా ప్రతి నాలుగు సంవత్సరాలకు, ఈ క్రీడలను నిర్వహించాలని ప్రకటించారు . అంటే ఇలా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సుమారు 12 శతాబ్దాలుగా ఈ క్రీడలు జరిగాయి. ఇక తరువాత క్రీస్తుశకం నాల్గవ శతాబ్దంలో ఈ ఒలింపిక్స్ క్రీడలను చక్రవర్తి థియోడిస్ నిషేధించడం జరిగింది.
2). ఇక ఆ తర్వాత సుమారు పదిహేను వందల సంవత్సరాలు గడిచిన పిమ్మట ఈ ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభం జరిగింది. అంటే 1896 సంవత్సరంలో గ్రీస్ దేశంలో మొదలుపెట్టడం జరిగింది.
3). ఇక ముఖ్యంగా ఈ ఒలంపిక్స్ క్రీడలు జరిగేటప్పుడు అందరు చాలావరకు నగ్నంగా పోటీపడేవాడరట. అయితే అప్పటికి ఇంకా మహిళలకు పాల్గొనడానికి అవకాశం కల్పించలేదు.
4). ఇక దాదాపు ఈ ఒలంపిక్ క్రీడలు 5 లేదా 6 నెలల పాటు కొనసాగేవి.
5). 1900 వ సంవత్సరాల నుండి ఒలంపిక్ క్రీడలలో మహిళలు పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.
6). 1924 సంవత్సరం నుండి 1992 సంవత్సరాల మధ్య కాలంలో వేసవికాలం అలాగే శీతాకాలం ఒలంపిక్స్ , ఒకే సంవత్సరంలో జరిగేవి . కాకపోతే ఇప్పుడు వాటిని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉండటం గమనార్హం.
7). 2012 వ సంవత్సరంలో లండన్ లో జరిగిన క్రీడలలో ఒక్క విజేతకు 165,000 తువ్వాల ను బహుమతిగా ఇచ్చేవారట.
8). శీతాకాలం అలాగే ఎండాకాలంలో జరిగే ఒలంపిక్స్ రెండింటిలో కలిపి కేవలం నలుగురు మాత్రమే పథకాలు గెలవడం జరిగింది.
9). ఇక ఈ ఒలింపిక్స్ క్రీడలలో ముఖ్యంగా ఉపయోగించే అధికారిక భాషలు ఇంగ్లీష్ అలాగే ఫ్రెంచ్.
10). ఇక సినిమా నటుడు టార్జాన్ కూడా 1920 సంవత్సరంలో అథ్లెట్ గా మారాడు. ఈతలో సుమారు 5 బంగారు పథకాలు గెలవడం విశేషం.
11). అంతేకాదు 1912 సంవత్సరం నుంచి 1958వ సంవత్సరం మధ్య కాలంలో కళాకారులు కూడా ఇందులో పాల్గొనడం విశేషం. ఇందులో ముఖ్యంగా వాస్తుశిల్పులు ,శిల్పులు, చిత్రకారులు, రచయితలు అలాగే సంగీత కళాకారులు కూడా ఆయా రంగాలలో పథకాలు గెలిచారు.
12). 2012లో లండన్ లో జరిగిన మొదటి అథ్లెటిక్స్ గేమ్స్ లో అన్ని దేశాల మహిళలు పాల్గొనడం జరిగింది.
13). ఇక ఒలంపిక్స్ చిహ్నంగా కనిపించే 5 వలయాలను ఆధునిక ఒలింపిక్ క్రీడల సహ వ్యవస్థాపకుడైన బారన్ పియరీ డి కూబెర్టిన్ రూపొందించారు.
14). ఆకుపచ్చ ,ఎరుపు, పసుపు, నీలం, నలుపు అలాగే తెలుపు నేపథ్యం కలిగిన రంగులను ఎన్నుకున్నారు. ఎందుకంటే ఇవి ప్రతి దేశం యొక్క జెండాలో కనీసం ఒక రంగు కలిసి ఉంటుంది కాబట్టి.
15). ఇక సుమారు ఒలంపిక్ క్రీడలకి 23 దేశాలు ఆతిధ్యం వహించాయి.
16). ఒలంపిక్స్ మొట్టమొదటి అధికారిక చిహ్నం వాల్డి.
17). 2016లో దక్షిణ అమెరికాలోని రియో లో మొదటిసారి ఒలంపిక్స్ నిర్వహించబడ్డాయి.
18). రియో లో మొత్తం 306 పోటీలు జరిగాయి. 2016 వ సంవత్సరంలో, 17 రోజులు జరగగా, 205 దేశాల నుండి సుమారు 10,500 మంది పాల్గొన్నారు.