కరోనా వైరస్ కారణంగా రోజు ఆఫీసుకు వెళ్లి చేసుకునే ఉద్యోగాలన్నీ ఇక ఇంటిపట్టునే ఉండి చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఆఫీసుకు వెళ్లే బాధ అయితే తప్పింది కానీ అటు వర్క్ ప్రెజర్ మాత్రం అందరికీ ఎక్కువైపోయింది. వర్క్ ఫ్రం హోం అన్న మాటే గానీ కనీసం బ్రేక్ తీసుకోవడానికి కూడా సమయం దొరకని పరిస్థితి నెలకొంది   ఇక నేటి రోజుల్లో వర్క్ ఫ్రం హోం అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఆఫీస్ కి వెళ్తే కేవలం తొమ్మిది గంటలు మాత్రమే పని చేసేవారు. ఈ 9 గంటల్లో  కూడా ఎన్నో సార్లు బ్రేక్ తీసుకునే వారు   కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఏకంగా అదనపు పనిగంటలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది  దీంతో జనాలు తెగ బిజీగా మారిపోతున్నారు.



 ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఎంతో మంది ఉద్యోగులు వివిధ రకాల పనులు చేస్తూనే ఇక లాప్ టాప్ ముందు పని చేస్తున్న వీడియో లు కూడా ఎన్నో వైరల్ గా మారిపోయాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం వర్క్ ఫ్రం హోమ్ అనే పదాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న వ్యక్తిని చూస్తే మాత్రం వామ్మో వర్క్ ఫ్రం హోమ్ ఏ రేంజ్ లో ఉందో అని అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే అతను పెళ్ళికొడుకు కాబట్టి. పెళ్లి వేడుకలో కూడా లాప్ టాప్ ముందు వర్క్ ఫ్రం హోం చేస్తూ కనిపించాడు సదరు వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వర్క్ పట్ల అంకిత భావం అంటే ఇదేనేమో అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.




 ఏకంగా పెళ్లి జరగడానికి కొద్ది నిమిషాల ముందు వరుడు తన లాప్ టాప్ తో మండపంలో కూర్చున్నాడు. చుట్టూ పెళ్లి వేడుక బంధుమిత్రులు అందరూ ఉన్నారు కానీ వరుడు మాత్రం తన లాప్ టాప్ లో వర్క్ చేస్తూ ఎంతో బిజీగా మారిపోయాడు. ఇక పక్కన ఉన్న వారిని ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు  దీంతో కొంత మంది బంధువులు తలలు పట్టుకున్నారు  అయితే దీనికి సంబంధించిన వీడియోని అక్కడ ఉన్న కొంతమంది ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది  ఏకంగా వరుడు లాప్టాప్ లో వర్క్ పూర్తి చేసుకునే సందర్భంలో పక్కనే ఉన్న పురోహితుడు ఆ పెళ్లి వేడుకలో ఉన్న బంధువులు కుటుంబ సభ్యులు సైతం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wfh