కులం, మతం, వర్ణ, జాతి ఇలా మనుషుల మధ్య చాలా బేధాలుంటాయి.  కులాలు, మతాలు అంటూ మనుషులు ఒకరిపై మరొకరు దాడులకు కూడా దిగుతారు. మా జాతి వాడే అయితేనే... సాయం చేస్తామని... ఇతర జాతి గురించి మాకేందుకు అని అనే వాళ్లు కూడా ఉన్నారు. అలాగే కొందరు మరికొందరైతే... మతం కోసం కొట్టుకునే వారూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే... ఇలాంటివి మూగ జంతువుల్లో కనిపించవు. వాటిని ఆకలి, ఆప్యాయతే తప్ప కోపాలు, పగలు, ప్రతీకారాలుండవు. అందుకే తమ జాతికి చెందిన జంతువులకు కూడా అవి సహాయం చేస్తాయి.

 అయితే.... తాజాగా ఓ కుక్క పులి పిల్లలకు పాలు ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియా లో తెగ వైరల్‌ అవుతుంది.  ఈ ఘటన తూర్పు చైనా లో చోటు చేసుకుంది.  తల్లి లేని మూడు పులి పిల్లలకు... కుక్క పాలు ఇచ్చింది.  జూలై 2 న షాన్‌ డాంగ్‌ ప్రానిన్స్‌ లోని లాంగ్‌ జూ మరియు బోటానికల్‌ గార్డెన్‌ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  పులి తన పిల్లలకు పాలు ఇవ్వడానికి నిరాకరించింది.  దీంతో ఆ పులి పిల్లలకు దిక్కు తోచని స్థితి కి చేరాయి. ఈ నేపథ్యం లో అదే గార్డెన్‌ లో ఉన్న ఓ తల్లి కుక్క... ఆ పులి పిల్లల బాధ చూసి తరించి పోయింది. 

దీంతో ఆ పులి పిల్లలకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లోనే... ఆ పులి పిల్లలకు పాలు ఇచ్చింది.  ఆ మూడు పులి పిల్లలు తల్లి వదిలేసి... కుక్క దగ్గరే ఉండిపోయాయి.  ఆకలి వేసినప్పుడల్లా... కుక్క దగ్గర కు వెళ్లి పాలు తాగుతున్నాయి. ఆ పులి పిల్లలు కుక్క తో బాగా కలిపిపోయాయి. అయితే.. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు,... తెగ ఎంజయ్‌ చేస్తున్నారు. ఇది నిజంగా గ్రేట్‌.. పులి పిల్లలకు కుక్క పాలు ఇవ్వడం.. నిజంగా ఆశ్చర్యకరమంటూ కామెంట్లు పెడుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: