యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతి తెలిపిన వివరాల ప్రకారం... మైనర్ ఈ పాకిస్తాన్ వద్ద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ వీడియోను షూట్ చేస్తుంటే 400 మంది తమపై దాడి చేశారని తెలిపింది. తనతో వచ్చిన వారి మొబైల్ ఫోన్లు మరియు ఇతర వస్తువులు లాగేసుకున్నారని తెలిపింది. అలాగే తన చెవి కమ్మలు మరియు మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారు అని తెలిపింది. తాము పారిపోవడానికి ఎంతగానో ప్రయత్నించామని కానీ దుండగులు తమని వదిలి పెట్టలేదని 400 మంది ఉండడంతో వారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా మారిందని తెలిపింది.
పార్క్ వాచ్ మెన్ తమను పారిపోవాలని గేట్ తెరచినా... వారినుండి తప్పించుకోవడం చాలా కష్టంగా మారింది అని తెలిపింది. అక్కడే ఉన్న చాలామంది తమకు సహాయం చేశారని కానీ ఎక్కువమంది తమపై దాడి చేయడంతో వారు తమను కాపాడలేకపోయారని చెప్పింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిందితులు ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం రోజున యువతిపై ఇలాంటి దాడి జరగడం పాక్ లో కలకలం రేపింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడం తో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతిపై దాడి ఘటన తమను కలిచివేసింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.