**స్టాఫ్ నర్స్కే లక్షలాది నెటిజన్ల మద్దతు**

**చర్యలు ఏ విధంగా తీసుకుంటారు..అంటూ సర్కార్కు ప్రశ్నలు**

**పునరాలోచనలో జిల్లా యంత్రాంగం**

బుల్లెట్ బండి పాట ఈ పది పదిహేను రోజుల నుంచి ఓ ట్రెండింగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట ఈ పాట మొదట్లో ఎవరు అంతగా పట్టించుకోకున్న ఓ పెళ్లికూతురు డాన్స్ చేయడంతో ప్రాచుర్యంలోకి మరింత వచ్చింది. ఈ డాన్స్ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఓ నర్స్ నృత్యం చేయడం అందరిని ఆకట్టుకుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో చేయడం వివాదానికి దారి తీయడం వెంటనే జిల్లా వైద్యాధికారి సుమన్ రావ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మోమో జారీ చేయడం ఇట్టే జరిగిపోయింది. కానీ స్టాఫ్ నర్స్  రజిని.. ఓ అనగారిన సామాజిక వర్గానికి చెందిన పేదింటి అమ్మాయి. ఉద్యోగం పట్ల కమిట్మెంట్, నిబద్దతను వైద్య సిబ్బందే అభినందిస్తారు. పదేళ్లకు పైగా అవుట్ సోర్సింగ్ విభాగంలో పని చేసి.. ఈ మద్యే కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తుంది. కరోనా సమయంలో కూడా కష్టపడి ప్రాణాలకు తెగించి పని చేసింది.


కరోనా బారిన పడింది. కోలుకుంది. ఐన తన ఆత్మస్థైర్యాన్ని వదులుకోలేదు. ఆస్పత్రిలో సిబ్బందితో కానీ, రోగులతో కానీ ఎప్పుడు నవ్వుతూ..నవ్విస్తూ..చలాకీగా ఉంటుంది. పంధ్రాగస్టు రోజున సరధాగా చేసిన డాన్స్.. వీడియో తోటి మిత్రులకు షేర్ చేసుకోవడంతో.. అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కి.. వైరల్ అయ్యి.. ఉద్యోగం కొల్పోయే పరిస్థితి వరకు వచ్చింది. మోమోల విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేల మంది నెటిజన్లు.. స్టాఫ్నర్స్ రజినికే మద్దతు పలికారు.. చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నారు.ఎంతో మంది లాంచాలు తింటూ.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాంగ తప్పు లేదు కానీ..జెండా వందనం రోజు సరదాగా చేస్తే తప్పేంటి..నిన్న మొన్నటి వరకు కరోనా కష్ట కాలంలో రాత్రింభవళ్లు పని చేసిన వారు.. రీలాక్స్ ఐతే తప్పేంటి అంటూ రజినికి సపోర్ట్ చేస్తున్నారు. దీనికి తోడు సిరిసిల్లలో చాలా వర్గాల నుంచి రజినికి సపోర్ట్ దొరికింది. ఏబీవీపి ఏకంగా ప్రెస్మీట్ పెట్టి రజినికి ఇచ్చిన మోమోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకుంటే ఆందోళన చెస్తామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్కు సైతం పలువురు రజిని విషయం.. పలువురు మేసేజ్లు పెట్టి చర్యలు తీసుకోవద్దని వేడుకున్నారు. రజిని కూడా సరదాగా చేసిన డాన్స్.. పొరపాటున సోషల్ మీడియాలో ఎక్కిందని.. మొదటి తప్పుగా మన్నించాలని రాతపూర్వకంగా అధికారులకు సంజీయిషి ఇచ్చింది.దీంతో అధికారులు సైతం వెనక్కి తగ్గారు.నేడో రేపో అధికారికంగా రజిని క్షమిస్తూ.. మోమోలు వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  క్రమశిక్షణ చర్యలో భాగంగా మాత్రం అన్ని పీహెచ్సీలకు పలు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: