అయితే ఈ కరోనా కారణంగా దేశంలో ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధించినప్పటికీ, కొంత వరకు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. గత రెండు మూడు నెలల నుంచి తగ్గుముఖం పట్టడంతో అందరూ కొంతవరకు ఊపిరిపీల్చుకున్నారు. కానీ త్వరలో కరోనా థర్డ్ వేవ్ రానుందని డబ్ల్యూహెచ్ఓ సంస్థ హెచ్చరిస్తునప్పటికీ, కొంతమంది అజాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే ఇక్కడ అందరూ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే , దేశంలో కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదనే చెప్పాలి. అందుకే రాబోయే రోజుల్లో, పండుగ దినాల్లో కూడా తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
ఇటీవల ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా తగ్గలేదు .. వచ్చే సెప్టెంబర్ ,అక్టోబర్ నెలల్లో ఎవరైతే పండగల జరుపుకోవాలనుకున్నారో, వారు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పండగలు జరుపుకోవాలని సూచించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ మాట్లాడుతూ .." కరోనా సమయాలలో సామూహిక దూరాలను తప్పకుండా పాటించాలని, టీకాలు వేయించుకున్న తరువాత కూడా జాగ్రత్తలు పాటించడం , మాస్క్ వేసుకోవడం లాంటివి తప్పకుండా పాటించాలని వారు సూచించారు. కాబట్టి ఈ కరోనా నుంచి బయట పడాలి అంటే, మునుపటిలాగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.