ముంబైలో ఒక 16 సంవత్సరాల అబ్బాయి పబ్జీ ఆటకు గత నెల నుంచి బానిస అయ్యి, ఏకంగా తన తల్లి ఖాతా నుంచి పది లక్షల రూపాయలను ఈ పబ్జీ ఆట కోసం కేటాయించినట్లు సమాచారం. ప్రతిరోజూ గుర్తించని ఆ తల్లిదండ్రులు, ఏదో అవసరం వచ్చి అకౌంట్ తెరవగా అందులో ఏకంగా పది లక్షల రూపాయలు స్వాహా అయినట్లు, అందులోనూ పబ్ జీ ఆటకు వెళ్లిపోయినట్లు అధికారులు చెప్పడంతో, ఒక్కసారిగా తల్లిదండ్రులకు షాక్ తగిలినట్టు అయింది. ఈ విషయంపై కొడుకును మందలించడం తో ఆ అబ్బాయి బుధవారం తన ఇంటి నుంచి పారిపోవడం జరిగింది.

ఇక వీరు తెలిపిన వివరాల మేరకు గత నెల నుంచి పబ్జి ఆడడానికి మొబైల్ లోనే మునిగిపోయాడు అని,  ఎంత చెప్పినా వినలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఆటలో డబ్బులు తన తల్లి ఖాతా నుంచి ఇతరులకు ట్రాన్సాక్షన్ చేసినట్లు వెల్లడైంది. ఇక అందుకే మేము అబ్బాయి మందలించడంతో అతను బుధవారం సాయంత్రం ఒక లెటర్ రాసి ఉంచి ఇంటి నుంచి పారిపోయాడు అని తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు.

తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు ముంబై పోలీసులు టెక్నాలజీ సహాయంతో ఆ బాలుడి ఆచూకీ కనుగొన్నారు. సుమారుగా కొన్ని గంటలపాటు క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆ అబ్బాయిని వెతకడం కోసం వారి సమయాన్ని కేటాయించి, ఎట్టకేలకు పోలీసులు గురువారం మధ్యాహ్నం తూర్పు అంధేరిలోని మహంకాళి గుహల ప్రాంతం లో ఈ బాలుడిని అనుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రుల దగ్గరకు పంపించారు.

ఏది ఏమైనా అంత చిన్న వయసు కలిగిన అబ్బాయి, కేవలం ఆటలకు బానిసై ఏకంగా పది లక్షల రూపాయలను నాశనం చేశాడు.. తల్లిదండ్రులు ఎన్నో రోజుల పాటు కష్టపడి దాచుకున్న డబ్బును ఒకే రోజు ఇలా నీటిలాగా ఖర్చు చేస్తుంటే, యువతను దారిలో పెట్టేది ఎవరు అంటూ మరికొంతమంది తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు..? అనే విషయాలను కూడా ఆరా తీస్తే, ఎటువంటి సమస్యలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: