కాలం ఎలాంటిదంటే ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో ఎవ్వరూ చెప్పలేము. మన చుట్టూనే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నిన్నటి వరకు మనతో ఉండే వాళ్ళు రేపు సడెన్ గా ధనవంతులైపోతుంటారు. కోట్లకు పడగలెత్తినవారు సైతం రాత్రికి రాత్రి దివాళా తీసే స్థాయికి చేరుకుంటారు. ఇది అంతా కూడా ఫేట్ అని చెప్పాలి. ఇదే విధంగా ఒక సాధారణ చేపలు పట్టుకునే వ్యక్తి ఒక్కరోజులో కోటీశ్వరుడైపోయాడు. అదెలాగో తెలిస్తే మీరు గంతులేస్తారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబై నగరం పాల్గర్ లోని ముర్బేకు చెందిన చంద్రకాంత్ అనే జాలరి తన బతుకు జీవనం అయిన చేపలను పట్టుకోవడం అమ్ముకుంటూ ఉండేవాడు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో వర్షాకాలం ఉన్నందున ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. ఇక చేసేదీమీ లేక నెల రోజులు ఊరకున్నారు.
అయితే ఈ మధ్యనే మళ్ళీ వేటకు వెళ్లేందుకు అనుమతి లభించడంతో ఎప్పటి లాగే ఆ రోజు కూడా చంద్రకాంత్ ఒక పదిమంది జాలరులతో కలిసి సముద్రం లోకి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్లిన చంద్రకాంత్ కు 157 చేపలు తన వలలో పడ్డాయి. అయితే వాటిని తీసుకుని వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ చేపలను కొనే వ్యాపారులు ఈ చేపలను చూసి అవి ప్రత్యేకమైన గోల్ జాతి చేపలని గుర్తించారు. ఇవి చాలా విలువైనవిగా గుర్తించారు. ఆ మధ్య వర్షాలు బాగా రావడంతో సముద్రం లోపల ఉండే చేపలన్నీ పైకి వచినట్టున్నాయి. అందుకే ఇంత విలువైన చేపలు లభించాయని అందరూ అనుకున్నారట. ఈ చేపలను కొనుక్కోవడానికి అక్కడి వ్యాపారులు అంతా వేలం వేశారట. ఎవరు ఎక్కువ పాడి కొనుక్కుంటే వారికే అవి సొంతం అని అంతా నిర్ధారించుకున్నారు.

 ఇలా ఆ 157 గోల్ జాతి చేపలను వేలం వేయగా ఎవ్వరూ ఉహించని విధంగా 1.33 కోట్ల రూపాయలు ధర పలికాయి. అంటే ఒక్కో చేప 85 వేల రూపాయలు. మరి చూశారా ఇంత ధర కలిగిన చేపను ఎప్పుడైనా చూశారా. దీనితో చంద్రకాంత్ ఒక్క రోజులోనే కోటీశ్వరుడైపోయాడు. అంతా తల రాత అని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: