ఇంటర్నెట్ లో ఉల్లాసకరమైన ఇంకా ఎంతో భయంకరమైన వీడియోలు మనకు కనిపిస్తాయి.అవి మనల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తాయి.ప్రతిరోజూ కూడా ఏదో ఒక ఫన్నీ వీడియో మనల్ని నవ్వించే విధంగా ఉంటుంది. ఇక ఈ వీడియో కూడా నెటిజన్ లను కడుపుబ్బా నవ్విస్తుంది. కొంతమంది చేసే పనులు చాలా సరదాగా ఉంటాయి. ఏదో చెయ్యాలని ఇంకేదో చేసి అందరిని నవ్విస్తూ ఉంటారు. కొందరు నవ్వుల పాలవ్వుతూ ఉంటారు. అయితే నవ్వుల పాలైన కొంతమంది హర్ట్ అవ్వకుండా ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ వీడియోలో ఒక మహిళ నీటిలో దూకి స్విమ్ చెయ్యడానికి ఆకట్టుకునే స్టంట్ చెయ్యాలనుకుంది.ఇక ఆమె ఆ స్టంట్ చేస్తున్నప్పుడు ఆమె విగ్ ఒక్కసారిగా గాలిలో ఎగిరింది. ఇక ఈ ఫన్నీ సంఘటన జార్జియాలో జరిగింది. ఓ స్నేహితుల బృందం స్విమ్మింగ్ పూల్ దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి తమ సమయాన్ని గడపాలని నిర్ణయించుకుంది. 

ఇక ఈ వీడియోలో డైవింగ్ బోర్డు మీద నిలబడి నీటిలో దూకడానికి సిద్ధమవుతున్న స్త్రీని మనం చూడవచ్చు. ఇక ఆమె కొలనులోకి దూకేటప్పుడు ,ఒక్కసారిగా ఆమె గింగరాలు తిరుగుతూ స్టంట్ చేసి నీటిలో దూకింది ఆ క్రమంలో ఆమె విగ్గు ఎగిరి పోవడంతో అక్కడ తమ స్నేహితులు చాలా నవ్వుకున్నారు.ఇక ఆ మహిళ కూడా అక్కడ ఏమి జరిగిందో గ్రహించి, ఇబ్బంది పడకుండా ఆమె కూడా నవ్వి ఆ మూమెంట్ ని తన స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది.ఇక ఈ వీడియో ట్విట్టర్‌లో 'హోల్డ్ మై బీర్' అనే పేరు గల యూజర్ షేర్ చేయడం జరిగింది.ఇక ఫన్నీగా "ఆమె తన జుట్టును తడిగా ఉంచడానికి ఇష్టపడలేదు" అని క్యాప్షన్ ఇచ్చి ఆ వీడియోని షేర్ చేశారు. ఇక అది నెట్టింట తెగ వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోని మొత్తం 36 వేల మందికి పైగా చూశారు. అలాగే 1800 మంది పైగా ఆ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక మీరు చూసేయండి. 

 https://twitter.com/HldMyBeer/status/1432114702998556672?t=ipPhpDSLtQ8DaXHYHU2FYw&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: