ముఖ్యంగా నకిలీ కాల్స్ కు పీఎఫ్ ఖాతాదారులు స్పందించకూడదు అన్న ఆలోచనతో ఈపీఎఫ్ఓ.. పీఎఫ్ ఖాతా దారులకు హెచ్చరికలు జారీ చేసింది.. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఖాతాదారుల నుండి యు ఏ ఎన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ పాన్ నెంబర్లు అలాగే బ్యాంక్ వివరాలను కానీ ఎప్పుడూ కూడా ఫోన్ కాల్ లో అడగదు అని, ఈపీఎఫ్ఓ తమ పీఎఫ్ ఖాతాదారులకు ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా చేయదు అని స్పష్టం చేసింది.
అందువల్ల మీకు ఎవరైనా యు ఏ ఎన్ నెంబరు, ఆధార్ నెంబరు, పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటివి తెలుసుకోవడం కోసం ఫోన్ చేయడం లేదా వాటి వివరాలను సేకరించాలని ప్రయత్నం చేసినపుడు వెంటనే ఫోన్ కట్ చేయాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. హ్యాకర్ల బారిన పడకుండా మీ భద్రతను మీరే చూసుకోవాలి అంటూ హెచ్చరించింది. పూర్తిగా ఆన్లైన్ మోసాలనునివారించాలి అని ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు స్పష్టం చేసింది.
ఇకపోతే covid-19 లాక్ డౌన్ సమయంలో చాలా మంది బ్యాంకింగ్ మోసాలకు గురి అయ్యారు అని, bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2018 2019 సంవత్సరంలో బ్యాంకు ఇంటర్నెట్ లావాదేవీల కారణంగా, ఖాతాదారులు ఏకంగా రూ.71,543 కోట్ల రూపాయలు నష్టపోయారు అని, ఇక ఈ సంవత్సరం రూ.2.05 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది అని.. చాలామంది ఈ హ్యాకర్ల మాటలకు మోసపోతున్నారు అని, జాగ్రత్తగా ఉండాలని పీఎఫ్ ఖాతా దారులకు ఈపీఎఫ్ఓ హెచ్చరించింది.