అమెరికాలో ఈ వినూత్న ఆవిష్కరణ సృష్టించడం జరిగింది. అది ఎలాగంటే అంటుకట్టడం లో వినూత్న పద్ధతులను ఉపయోగించి ,ఏకంగా ఒక చెట్టును సృష్టించాడు ఆ రైతు. పేరు సామ్ వాన్ అకెన్.. అమెరికాకు చెందిన ఒక రైతు అంటు కట్టే పద్ధతి లో 40 రకాల పండ్లను ఒకే చెట్టుకు కాయించడం జరిగింది.. ఆయన కేవలం రైతు మాత్రమే కాదు సైరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఈయన సృష్టించిన 40 రకాల పండ్లలో రేగు, నేరేడు ,చెర్రీ , పీచ్, వంటి వివిధ రకాల పండ్లు ఈ చెట్టు ద్వారా లభిస్తాయి.
ఇకపోతే ప్రొఫెసర్ సామ్.. అంటు కట్టే విధానం ద్వారా 40 రకాల పండ్లను అందించే ఒక చెట్టును సృష్టించడం జరిగింది. ఈ చెట్టు మొగ్గ వేయడానికి సుమారుగా తొమ్మిది సంవత్సరాల సమయం పట్టిందట. అంటు కట్టడం అంటే ఒక చెట్టు కొమ్మను.. ఇంకొక చెట్టుకు గట్టిగా అతికిస్తారు.. అప్పుడు ఆ అంటూ చెట్టు మిగతా చెట్టు కొమ్మకు సమంగా పోషకాలు అందించి, ఆ కొమ్మ కూడా చక్కగా పెరుగడానికి సహాయపడుతుంది.. ఇక ఇదే పద్ధతిని ఆయన మొగ్గ ఉన్న ఒక చెట్టు కొమ్మను వేరు చేసి, మరొక ప్రధాన చెట్టుకు చలికాలంలో అంటు కట్టడం జరిగింది..
ఈ అద్భుతమైన ఆవిష్కరణ సాధించడానికి ప్రొఫెసర్ 2008 నుంచి ఈ గ్రాఫ్టింగ్ విధానాన్ని పాటిస్తున్నారట. ప్రొఫెసర్ న్యూయార్క్ స్టేట్ అగ్రికల్చర్ ఎక్స్పరిమెంట్ స్టేషన్లో ఉన్న ఒక తోట గురించి తెలుసుకొని, ఇలాంటి ఒక అరుదైన చెట్టుని రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ వున్న తోటలో 200 కంటే ఎక్కువ రకాల రేగుపండ్లు ,నేరేడు పండ్లు పండించే వారు.. కానీ సరిపడా కూలీలు లేక నిరుపయోగంగా వదిలేయడంతో, ఈ తోటను కౌలుకు తీసుకొని శిల్పం ద్వారా అంటుకట్టుట అనే ప్రయోగాన్ని చేయడం ప్రారంభించాడు.. దాదాపు ఏళ్ల తరబడి శ్రమించి 40 రకాల నోరూరించే పండ్లను ఒకే చెట్టుకు పండించగలిగాడు.. ఒక్కో సీజన్లో ఒక్కో రకం పండించే పంటలను , కేవలం ఒకే సీజన్ లోనే అన్ని రకాల పండ్లను పండించి చరిత్ర సృష్టించాడు ప్రొఫెసర్ సామ్.