ఒకప్పటి జనరేషన్లో లోకజ్ఞానం రావడానికి ఒక వయస్సు రావాలి అని చెప్పేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం లోకజ్ఞానం కాదు అంతకు మించిన జ్ఞానాన్ని చిన్నవయసులోనే సంపాదిస్తున్నారు ఎంతోమంది. నేటి రోజుల్లో పిల్లలు చిన్నారులు అనడం కంటే చిచ్చార పిడుగులు అనటం బెటర్. నేటి రోజుల్లో ఎంతో మంది చిన్నవయసులోనే ఊహించని రీతిలో తమ ప్రతిభతో ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది స్కూల్ చదువుతూన్న వయసులోనే గిన్నిస్ బుక్ రికార్డును సైతం కొల్లగొడుతున్నారు. ఇక్కడ ఓ 16 ఏళ్ల బాలిక ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.



 సాధారణంగా పదహారేళ్ళ వయసులో ఎవరైనా ఏం చేస్తారు..  ఇంకేం చేస్తారు చదువుకుంటూ స్నేహితులతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. అంతే కాదు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ ఉంటారు కానీ ఇక్కడ ఒక బాలిక మాత్రం పదహారేళ్ళ వయసు లో సంచలనం సృష్టించింది.  కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. పదహారేళ్ళ వయసు లోనే ప్రపంచ రికార్డు సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం ఇక ఈ 16 ఏళ్ల బాలిక కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 పదహారేళ్ల అమ్మాయి సుచేత సతీష్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇటీవల చోటు దక్కించుకోవడం గమనార్హం  ఇంతకీ ఈ ప్రపంచ రికార్డు కొట్టేయడానికి బాలిక ఏం చేసింది అని అనుకుంటున్నారా.. ఆ బాలిక పాట పాడింది. అదేంటి పాట పాడిన దానికే గిన్నిస్ బుక్ రికార్డు ఇచ్చేస్తారా అని ఆశ్చర్య పోతున్నారు కదా.. అయితే ఈ బాలిక పాట పాడింది కేవలం ఒక నిమిషమో ఐదు నిమిషాలో కాదు ఏడు గంటల ఇరవై నిమిషాలు అది కూడా 102 భాషలలో ఈ పాట పాడి ప్రపంచ రికార్డు సృష్టించింది ఈ బాలిక . ఆగస్టు 19 వ తేదీన దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ ఘనత సాధించింది. ఇటీవలే గిన్నెస్ బుక్ ప్రతినిధులు ఈమెకు సర్టిఫికెట్ అందజేసారు. కేరళకు చెందిన ఈమె మూడేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: