ఈ నేపథ్యంలో ని కాబోయే దంపతులు కొన్ని రోజులు కలిసి ఒకరినొకరు తెలుసుకోవడానికి, ట్రావెల్ చేసే సమయం కూడా లభిస్తోంది.. అయితే ఈ జర్నీలో మీరు ఎదుటి వ్యక్తి గురించి అర్థం చేసుకుని వారు ఎలాంటి వారు అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది.. ముఖ్యంగా వారి అలవాట్లను ,మాట తీరును, లక్షణాలను కూడా గమనించవచ్చు.. తద్వారా మీరు ఆ వ్యక్తిని మీ జీవిత భాగస్వామి చేసుకోవచ్చు.. లేదో తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది.. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని లక్షణాలు కలిగిన వ్యక్తిని మీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు మానసిక నిపుణులు..
స్వార్థపరులు:
ఎప్పుడు నేను ,నాది, నాకు మాత్రమే సొంతం అని ఆలోచిస్తూ ఉంటారు.. వీరిద్దరి నుంచి నాకు, నేను అన్న పదమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.. అంతేకాదు ఈ ప్రపంచంలో తామే అన్నిటికీ కేంద్ర బిందువులు అని ఫీల్ అవుతూ ఉంటారు.. ప్రతి ఒక్కరూ తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.. కాబట్టి వీళ్ళతో వేగడం చాలా కష్టం.
మూలిగే మనిషి ఇక అసలే వద్దు:
ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధ పడుతు, మూలుగుతూనే ఉంటారు.. వారు చేసిన తప్పులను కూడా ఇతరుల మీద పెట్టి బాధపడిపోతుంటారు.. అయితే వీరిని భరించడం చాలా కష్టం.
హిపో క్రైట్స్:
ఇలాంటి వ్యక్తులు చెప్పేది ఒకటైతే.. చేసేది మరొకటి అవుతుంది.. అంతేకాదు వీరు మాటలు చాలా స్పూర్తిగా అందంగా కనిపిస్తాయి.. కానీ వీరు చేసే పనులు మాత్రం ప్రతి ఒక్కరికీ చికాకును తెప్పిస్తాయి. ముఖ్యంగా వీరు చేసే పనిని సమర్థించుకుంటూ, అదే ఆ పనిని ఎదుటి వారు చేసే తప్పులు వెతుకుతూ ఉంటారు.. ఇలాంటి మోసకారి వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది..
అబద్దాలు ఆడేవారినీ, జీవితంలో అస్పష్టత గా ఉండే వాళ్ళని వివాహం చేసుకోకపోవడమే మంచిది.