అయితే ఈ విషయాన్నీ సదరు టీవీ ఛానల్ అనుకోకుండా ఈ వీడియోలను ప్రసారం చేసిందా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా కావాలనే చేశారా అనే విషయం అర్ధం కావడంలేదు. అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చెందిన KERM 2 న్యూస్ స్టేషన్ ఈ అడల్ట్ కంటెంట్ ని పమాదవశాత్తు అక్టోబర్ 17 న సాయంత్రం ఆరుగంటల ముప్పై నిముషాల వార్తల్లో ప్రసారం చేసింది. యాంకర్ మిషెల్లే బాస్ ఉష్టోగ్రత మరియు వాతావరణ విశేషాల గురించి చెబుతున్న సమయంలో ఈ పోర్న్ వీడియో ప్లే అయ్యింది. ఈ వీడియో చూసిన అందరికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రస్తుతం ఈ లైవ్ వీడియోని సోషల్ మీడియా గురించి నెటిజన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ వీడియోని ముందుగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అదికాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
అయితే సదరు టీవీ యజమాని జరిగిన తప్పు కారణంగా KREM ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. రాత్రి 11 గంటలకు వచ్చిన వార్తల్లో యాజమాన్యం ఇలా స్పందించింది "షో ఫస్ట్ పార్టులో ఓ అనుకోని వీడియో ప్లే అయ్యింది. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకుంటాం." అని న్యూస్ రీడర్ తెలిపారు . అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది అదేంటంటే .. లైవ్ వీడియో కి , ఛానల్ ప్రసారం చేసే ఎయిర్ వీడియో కి కనీసం మూడు సెకన్ల వ్యత్యాసం ఉంటుంది. మహా అయితే ఐదు నిముషాలు వీడియో నడిచి ఉన్నా యాజమాన్యం వెంటనే దాన్ని అపి ఉండవచ్చు కానీ కావాలనే 15 నిముషాలు కొనసాగించారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఐతే పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రసారమవ్వడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. కారణాలు ఉద్దేశపూర్వకం గా జరిగి ఉన్నట్లయితే సదరు న్యూస్ ఛానల్ పై కఠిన చర్యలు ఉండనున్నాయి. ఇలాంటి ఘటనే 2012 వ సంవత్సరం లో వర్జీనియా లోని రోనోక్ అనే వార్త ఛానల్ లో సాయంత్రం ప్రసారమైన వార్తల్లో బూతు వీడియో లను ప్రసారం చేశారు. అప్పట్లో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వార్త ఛానల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసారు . ఆ ఛానల్ పై కోర్ట్ విచారణ జరిపించి 3.25 లక్షల డాలర్ల జరిమానా వేశారు